టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలా స్థాయి కూడా చాలా వరకు పెరిగిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలకే 100 కోట్ల సినిమా చాలా పెద్ద విషయంగా కనబడేది. కానీ ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు 100 కోట్ల కలెక్షన్లు అనేవి పెద్ద విషయం కానే కాదు. సినిమాలో కంటెంట్ బాగుంటే స్టార్ హీరోలు నటించిన సినిమాలకు ఈజీగా 1000 కోట్ల కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఇక మీడియం రేంజ్ హీరోలు మాత్రం 100 కోట్ల పై గట్టి టార్గెట్ పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే కొంత మంది హీరోలు తమ సినిమాలతో 100 కోట్ల కలెక్షన్లను కూడా రాబట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ 100 కోట్ల కలెక్షన్లను రాబట్టిన కొంత మంది హీరోలు ఆ తర్వాత మాత్రం అదే స్థాయిలో కెరియర్ను ముందుకు సాగించడంలో తడబడుతున్నారు ... వారు ఎవరో తెలుసుకుందాం.

పంజా వైష్ణవ్ తేజ్ : ఈయన ఉప్పెన మూవీతో హీరోగా పరిచయం అయ్యి ఈ సినిమాతోనే 100 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. ఇక ఆ తర్వాత మాత్రం ఈయనకు కనీసం యావరేజ్ విజయం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఈయన ఉప్పెన మూవీ తర్వాత కొండపొలం , రంగ రంగ వైభవంగా , ఆదికేశవ సినిమాలతో ప్రేక్షకులను పలకరించి ఈ మూడు సినిమాలతో ఫ్లాప్స్ ను అందుకున్నాడు.

వరుణ్ తేజ్ : ఈయన ఇప్పటి వరకు ఎఫ్ 2 , ఎఫ్ 3 సినిమాలతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆఖరుగా ఈయన ఎఫ్ 3 సినిమా తర్వాత ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న వరుణ్ తేజ్ కు మంచి విజయం మాత్రం దక్కడం లేదు.

నిఖిల్ : ఈ నటుడు కార్తికేయ 2 సినిమాతో 100 కోట్ల కలెక్షన్లను అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన నటించిన 18 పేజెస్ మూవీ పర్వాలేదు అనే స్థాయి విషయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఈయన నటించిన స్పై , అప్పుడు ఇప్పుడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా ఈ నటుడు కూడా 100 కోట్ల సినిమా తర్వాత పెద్ద స్థాయి విజయాలను అందుకోవడంలో సక్సెస్ కాలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: