సినిమాల హిట్ ప్లాప్‌లతో హీరోయిన్లకు సంబంధం ఉంటుందా ? ఉండదా ? అసలే గ్లామర్ లేక ఇండస్ట్రీ అల్లాడుపోతుంటే ఉన్న వారి మీద కూడా లేనిపోని అపవాదులు ఎందుకు ? అని అంటున్నారా ? ఇలా చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌లా గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి .. అయితే వారిలో భాగ్యశ్రీ , పూజా హెగ్డే , కృతి శెట్టి గురించి సినీ వర్గాలో రకరకాల టాక్‌లు నడుస్తున్నాయి .. అవి ఏంటో ఇక్కడ చూద్దాం. స్టార్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ఈ మధ్య ఎవరిని అడిగిన .. ఆమె ఉంటుందా .. పోతుందా అనేది ఈ సంవత్సరం డిసైడ్ చేస్తుందని ఓపెన్ గా చెప్పేస్తున్నారు ..


వెండితెరపై ఈ పొడుగు కాళ్ల సుందరి బ్లాక్ బస్టర్ చూసి చాలా కాలం అవుతుంది . మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈమెను ఆదుకోవాల్సిన బరువును తన భుజాల మీద వేసుకున్నాడు సూర్య .. ఈ సమ్మర్ లో రిలీజ్ అయ్యే రెట్రో హిట్ అయితేనే పూజ హెగ్డే కి ఫీచర్ లేకుంటే చేతులో ఉన్న ఒకటి అరా సినిమాలతో దుకాణం సర్దుకోవాల్సిందే. ఇలా పూజ హెగ్డే మాత్రమే కాదు .. కోలీవుడ్లో భాగ్యశ్రీ కి కూడా మంచి ఛాన్స్ ఇస్తున్నారు సూర్య .. నడిప్పిన్‌ నాయగన్‌ సినిమాలో భాగ్యశ్రీ  నే హీరోయిన్ అని అంటున్నారు .. ఈమె మొదటి సినిమా మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా భాగ్యశ్రీ కి వరుస‌ అవకాశాలు వస్తున్నాయి .. యంగ్ హీరోల క్రేజీ ప్రాజెక్టులకు మొదటి ఛాయిస్ గా కనిపిస్తున్నారు భాగ్యశ్రీ .


అలాగే ఇదే విషయం మరో బ్యూటీ కృతి శెట్టి కి కూడా వర్తిస్తుంది ..ఉప్పెన తో నాన్ స్టాప్ అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీకి వరుసగా సినిమాలొచ్చాయి .. అయితే హిట్లు మాత్రం రాలేదు .  అయితే ఈ మధ్య మలయాళ హీరో టోవినో తో చేసిన మలయాళ మూవీ హిట్ అయింది . ప్రస్తుతం ఈ బ్యూటీ కి ఒకటి రెండు తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి .. ఇలా గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి ఇండస్ట్రీ రెడీ .. కాకపోతే వాటిని నిలబెట్టుకుంటే లాంగ్ కెరియర్ ఉంటుంది .. లేకుంటే ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లాల్సిందే అని అంటున్నారు సినీ క్రిటిక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: