
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచారని చెప్పుకొచ్చారు. ఆయన మా నుంచి భౌతికంగా దూరమై ఏడాది అవుతుందని బుచ్చిబాబు పేర్కొన్నారు. ఉప్పెన మూవీ రిలీజ్ సమయంలో నాన్న చేసిన పని ఇంకా గుర్తుందని ఆయన వెల్లడించారు.
ఉప్పెన సినిమా గేట్ బయట నిలబడి మూవీ బాగుందా అని వచ్చిన వారందరినీ అడిగేవారని చెప్పుకొచ్చారు. నాన్న సినిమా కూడా చూడకుండా థియేటర్ కు వచ్చిన వాళ్ల అభిప్రాయాలను తెలుసుకున్నారని కామెంట్లు చేశారు. నేను ప్రస్తుతం తీస్తున్న చరణ్ సినిమా బాగుందా అనే సందేహం అక్కర్లేదని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని కామెంట్లు చేశారు.
రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద బాక్సాఫిస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీకి సంబంధించి త్వరలో అధికారిక అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రామ్ చరణ్ రెమ్యునరేషన్ సైతం గత కొన్నేళ్లలో భారీ స్థాయిలో పెరిగింది. రామ్ చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి. రామ్ చరణ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ ఇతర భాషల్లో సైతం భారీ స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.