టాలీవుడ్ హీరోయిన్ సమంత తన అనారోగ్యం సమస్యల కారణంగా కొన్ని రోజులపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.. అప్పుడప్పుడు హెల్త్ వీడియోలను పలు రకాల కొటేషన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నది. అలాగే బిజినెస్ వైపుగా కూడా అడుగులు వేసింది సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. సీటాడెల్ సినిమాతో కూడా ఒక అవార్డును కూడా అందుకున్నది. ప్రస్తుతం సమంత చేతిలో మా ఇంటి బంగారం అనే ఒక సినిమా మాత్రమే ఉన్నది. ఇది కూడా తన సొంత నిర్మాణం లోనే నిర్మిస్తోందట సమంత.


అయితే తదుపరి సినిమాల కోసం సమంత ఒప్పుకోలేదు. బాలీవుడ్ లో మరొక వెబ్ సిరీస్ కి ఓకే చెప్పింది. అది రక్త్ బ్రహ్మాండ్ ఈ చిత్రాన్ని రాజ్ అండ్ డీకేలు తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సిరీస్ 25 రోజులపాటు షూటింగ్ జరిగిందట .ప్రస్తుతం ఈ షూటింగ్ కూడా ఆగిపోయినట్లు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. నెట్ఫ్లిక్స్ 25 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ కి సగం బడ్జెట్ కేటాయించారట. ఇంకా కొంతమేరకు బ్యాలెన్స్ షూటింగ్ కూడా ఉన్నదట.

అయితే ఈ సిరీస్ కి పని చేస్తున్న ఒక ఎగ్జిక్యూట్ ప్రొడ్యూసర్ బడ్జెట్ విషయంలో ఎన్నో అవకతవకలకు పాల్పడి కొన్ని కోట్ల రూపాయలను కూడా దొంగలించారనే విధంగా బాలీవుడ్లో టాక్ వినిపిస్తున్నది. ఈ సిరీస్ మాటిమాటికి స్క్రీన్ ప్లే మారుస్తూ ఉండడంతో ఖర్చు పెరుగుతున్నట్లు డైరెక్టర్ రాఖీ అనిల్ బార్వే తెలిపారట. దీంతో నెట్ ఫ్లిక్ యూనిట్ పైన కూడా ఫైర్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రాజు అండ్ డీకే నిర్మాణ సంస్థను కూడా ప్రశ్నించిందట. అలా ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే సమంత ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి బాధపడుతున్నారు. సమంత చేతిలో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఆగిపోవడం బాధాకరమని తెలుపుతున్నారు. ఈ నిర్మాణ సంస్థ అధిక నేతలలో ఒకరైన సమంత డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరూ కలిసి రెగ్యులర్గా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: