టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాకు పార్ట్ 2 ఉండబోతున్నట్లు ఈ మూవీ బృందం వారు సలార్ పార్ట్ 1 చివరన అధికారికంగా ప్రకటించారు. దానితో ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని ప్రభాస్ అభిమానులతో పాటు అనేక మంది ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ , మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ ,  హను రాగవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ అనే సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు మూవీ ల తర్వాత సలార్ 2 మూవీ షూటింగ్ను మొదలు పెడతాడు అని చాలా మంది అనుకున్నారు. ఇక ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 స్క్రిప్టును రెడీ చేస్తున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త కూడా వైరల్ అయింది. ఇకపోతే ఇప్పటికే ప్రశాంత్ నీల్ , జూనియర్ ఎన్టీఆర్ తో ఓ మూవీ కి కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ మూవీ యొక్క షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాతే ప్రభాస్ తో సలార్ 2 మూవీ ని ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానితో ఇప్పట్లో సలార్ పార్ట్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ కావడం కష్టమే అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలా సలార్ 2 షూటింగ్ ఇప్పట్లో స్టార్ట్ కావడం కష్టమే అనే వార్తలు వైరల్ అవుతుండడంతో ప్రభాస్ ఫాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: