100 కోట్లు సినిమా అంటే ఒకప్పుడు ఎంతో మంచి క్రేజ్ .. కానీ ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులో ఉన్న గోల్ .. మంచి కథ , కథనం అన్ని విధాలుగా కలిసి రావాలే కానీ సక్సెస్ అందుకోవటం ఎంతో తేలి క.. సక్సెస్ తెచ్చుకోవడం ఈజీయే , కానీ ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం మాత్రం అంతా ఈజీ కాదు అంటున్నారు ట్రేడ్ పండితులు . మెగా హీరో వైష్ణవ తేజ్ మొదటి సినిమా ఉప్పెనా తోనే 100కోట్ల హీరోగా ఎంట్రీ ఇచ్చారు .. ఈ మెగా మేనల్లుడు .. కానీ ఆ తర్వాత దాన్ని కాపాడుకోలేకపోయాడు .. ఆ తర్వాత రవితేజ ధమాకా కలెక్షన్ చూసి ఈ హీరోకి కూడా ఫ్యూచర్లో తిరిగి ఉండదని అనుకున్నారు .. బట్ తర్వాత ఆ రేంజ్ లో తర్వాత సినిమాలను చేయలేకపోయాడు.


వైష్ణవ తేజ్ - రవితేజ మాత్రమే కాదు వరుణ్ తేజ్ పరిస్థితి కూడా ఇదే .. ఎఫ్ 2 , ఎఫ్ 3 తర్వాత ఈ హీరో దగ్గర్నుంచి చెప్పుకోదగ్గ హీట్ లేదు .. గత సంవత్సరం హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ తెచ్చుకున్న తేజ స‌జ్జా ఇప్పటిదాకా తన మరో సినిమాని రిలీజ్ చేయలేదు. ఇలా తన తర్వాత సినిమా విషయంలో ఎంతో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు తేజ సజ్జా.. తండెల్ సినిమాతో నాగచైతన్య కూడా ఈ లిస్టులో ఎంట్రీ ఇచ్చాడు .. ఇప్పుడు చైతన్య‌ కూడా ఇలాంటి కేర్ తీసుకోవాల్సిందే చైతన్య కెరియర్ లో తొలి 100 కోట్లు సినిమా తండేల్.


అటు సిద్ధు జొన్నలగడ్డ లైఫ్ లో టిల్లు మూవీని ఎవరు మర్చిపోలేరు .. అలాగే టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు దాటి మంచి హైప్‌ లో ఉన్నారు సిద్దు జొన్నలగడ్డ .. ఈయన తర్వాత సినిమాలు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు అభిమానులు. అలాగే కార్తికేయ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా అటెన్షన్ తెచ్చుకున్నారు నిఖిల్ .. ఆ తర్వాత చేసిన ఒకటి రెండు సినిమాలు ఫెయిల్ అయిన వాటిని నిఖిల్ అతను డైరెక్ట్ గా వేయలేం అనేది క్రిటిక్స్ మాట .. కాకపోతే  ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాలను బట్టి ఆయన ఫ్యూచర్ డిసైడ్ కానుందని మాత్రం అందరూ అంటున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: