మన చిత్ర పరిశ్ర‌మ‌లో ఇప్పటికే చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించారు .. తమ బ్యాగ్రౌండ్ తో సంబంధం లేకుండా తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో విజయం సాధిస్తూ దూసుకుపోతున్నారు .. ఇప్పటికే చాలామంది హీరోల కొడుకులు , కూతుర్లు ఎంట్రీ ఇచ్చారు .. అలాగే కమెడియన్స్ , క్యారెక్టర్ ఆర్టిస్టుల పిల్లలు కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు .. అయితే ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది .. ఇంతకీ అతను మరెవరో కాదు స్టార్ దర్శకుడు శంకర్ కోడుకు .. ఎస్ శంకర్ కొడుకు ఇప్పుడు ఇండస్ట్రీలోకి రాబోతున్నాడని కోలీవుడ్ లో టాక్‌ వినిపిస్తుంది .. మన చిత్ర పరిశ్రమ లో గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శంకర్ కొడుకు అసిస్టెంట్ డైరెక్టర్గా చిత్ర పరిశ్ర‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.
 

ఇక దర్శకుడు శంకర్ తన కెరియర్ మొదట్లో దళపతి విజయ్ తండ్రి దర్శకుడు చంద్రశేఖర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు .. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా పలు సినిమాలకు పనిచేసిన శంకర్ 1993లో మొదటి సినిమాకి దర్శకత్వం వహించారు .. యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన జెంటిల్మెన్ సినిమాతో శంకర్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. విద్యాసంస్థల్లో అవినీతి దోపిడీలపై దృష్టి సారించిన మొదటి చిత్రం ఇది .. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది .. ఆ తర్వాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విడుదలైన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి.

 

ఇక శంకర్ తమిళ సినిమాల్లోని ప్రముఖ న‌టులు రజినీకాంత్ , కమల్ హాసన్ , విజయ్, విక్రమ్ వంటి హీరోలతో సినిమాలు చేశారు . అయితే గత కొన్ని రోజులగా శంకర్ దగ్గర నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి . ఇదే క్రమంలో శంకర్ చిన్న కూతురు అతిధి శంకర్ కూడా హీరోయిన్గా సినిమాలు చేస్తుంది .. టాలీవుడ్లో ప్రస్తుతం ఈమే భైరవం అనే సినిమాలు నటిస్తుంది .. అలాగే ఇప్పుడు శంకర్ కొడుకు దర్శకుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు .. అయితే శంకర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు సినిమాల్లోకి రావాలని కోరుకున్నట్లు చెప్పాడు .. ఇక శంకర్ కొడుకు అరిజిత్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న మద్రాసి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు .. ఇదే వార్త కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ లో మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: