నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో అద్భుతమైన విజయాలతో కెరియర్ ఫుల్ జోష్లో ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా బాలకృష్ణ బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ , ఊర్వశి రౌటేలా , శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్య పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు.

మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా డాకు మహారాజ్ సినిమాతో పాటు రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా విడుదల అయ్యాయి. ఇందులో ఈ సంవత్సరం అన్ని సినిమాల కంటే మొదట విడుదల అయిన గేమ్ చేంజర్ మూవీ కి నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా ఈ సంక్రాంతికి పెద్దగా ఇంపాక్ట్ ను చూపలేకపోయింది. ఆ తర్వాత విడుదల అయిన డాకు మహారాజ్ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇక జనవరి 14 వ తేదీన విడుదల అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది.

ఇక డాకు మహారాజ్ సినిమాకు సంబంధించిన ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూవీ మంచి కలెక్షన్లను వసూలు చేసే డీసెంట్ విజయాన్ని అందుకుంది. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎఫెక్ట్ కారణం గానే ఈ మూవీ కలెక్షన్లు కాస్త తగ్గాయి అని సంక్రాంతి పండక్కు ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి వస్తున్నాం సినిమా వైపు మొగ్గు చూపడంతో డాకు మహారాజు సినిమా కలెక్షన్లు తగ్గాయి అని డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి పండక్కు కాకుండా వేరే ఏదైనా తేదీన రిలీజ్ అయి ఉంటే భారీ కలెక్షన్లను వసూలు చేసి ఉండేది అని బాలయ్య అభిమానులు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: