\గత కొంత కాలంగా ఏదైనా మంచి గుర్తింపు కలిగిన హీరో సినిమా థియేటర్లలో విడుదల అయింది అంటే ఆ సినిమా ఒక వేళ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నట్లయితే ఆ సినిమా మహా అయితే 50 రోజుల తర్వాత ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక కొన్ని సినిమాలు నెల తర్వాత ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తే , మరికొన్ని సినిమాలు నెల తిరగకుండానే ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇక ఇలా ఓ టీ టీ లోకి సినిమాలు అత్యంత వేగంగా వస్తున్న సమయంలో ఓ ఇద్దరు మంచి గుర్తింపు కలిగిన నటులు నటించిన రెండు సినిమాలు విడుదల విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఏ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో అక్కినేని అఖిల్ ఆఖరుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను సోనీ లీవ్ సంస్థ దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే సోనీ లీవ్ సంస్థ వారు ఈ సినిమాను తమ ఓ టీ టీ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ సోనీ ఓ టీ టీ లో స్ట్రీమింగ్ కాలేదు.

ఇప్పటికి కూడా ఈ సినిమా ఏ ఓ టీ టీ లోకి కూడా అందుబాటులోకి రాలేదు. ఇక శర్వానంద్ ఆఖరుగా మనమే అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటి వరకు ఈ సినిమా కూడా ఏ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి రాలేదు. ఇలా ఈ ఇద్దరు మంచి గుర్తింపు కలిగిన హీరోలు నటించిన ఏజెంట్ , మనమే సినిమాలు ఇప్పటి వరకు ఏ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: