సినీ నటుడు మంచు మనోజ్ బాబు ఇంటా మరోసారి విభేదాలు చోటుచేసుకున్నాయి. గత కొంత కాలంగా మంచు కుటుంబంలో ఆస్తి గురించి గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలుసు. మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్ లో తన తండ్రిపై ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుండి మంచు కుటుంబం గురించి వరుస వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఇకపోతే గతంలో మంచు విష్ణు, మనోజ్ కొట్టుకున్న విషయం తెలిసిందే. తన పెళ్లి తర్వాత విష్ణు తనపై దాడి చేస్తాడని మంచు మనోజ్ రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. అయితే ఆ వీడియో రియాలిటీ షోలో భాగంగా తీసింది అని మంచు విష్ణు కవర్ చేశారు. ఇటీవల మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య జరిగిన గొడవలు అంతా ఇంత కాదు. అయితే వారి గోడవలను కవర్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ గోడవల కారణంగా టీవీ 9 ఛానల్ రిపోర్టర్ రంజిత్ కుమార్ పై మోహన్ బాబు దాడి చేశారు.
ఆ తర్వాత తప్పు తనదేనని మోహన్ బాబు ఒప్పుకున్నారు. అయితే ఇటీవల మంచు ఇంట మళ్లీ రచ్చ మొదలైంది. రీసెంట్ గా మంచు మనోజ్ కి, పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మనోజ్, మోహన్ బాబుని ఉద్దేశించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మనోజ్ ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమురం భీముడో సాంగ్ ని పోస్ట్ చేశారు. ఆ పాటను తెరపైకి తెచ్చిన టీమ్ కి ధన్యవాదాలు చెప్పాడు. ఇది చూసిన వారందరూ.. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ ని కట్టేసి కోడతారని, అయిన ఎక్కడ తగ్గడని.. అలాగే మనోజ్ కూడా తగ్గను అని పరోక్షంగా చెప్పడానికే పెట్టడని చెప్పాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: