తెలుగు సినిమా ఇండస్ట్రీలోకనీవిని ఎరగని రీతిలో భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి ప్రభాస్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.వరుసగా బాహుబలి, సాహో లాంటి సినిమాలతో విజయాలను అందుకున్న ఆయన సలార్, కల్కి సినిమాలతో భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలతో మొత్తం మరోసారి తనకంటూ ఒక ఐడిటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సలార్ 2 సినిమాని పట్టలెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాలతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇదిలావుండగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు హీరోలకు కొన్ని కండిషన్లు పెడుతున్న విషయం తెలిసిందే. దర్శకు ధీరుడు రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్న సమయంలో ఎటువంటి లీకులు ఉండకుండా ఉండాలని ఫోన్ లను బయటపెట్టాలని చెప్పాడు.అదేవిధంగా షూటింగ్ లొకేషన్లోకి ప్లాస్టిక్ బాటిల్ తీసుకురావద్దని కండిషన్ కూడా పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ పాన్ ఇండియా హీరోకు ఓ కండిషన్ పెట్టారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

డైరెక్టర్ మరెవరో కాదు అర్జున్ రెడ్డి సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించిన టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈయన ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ తో స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈయన ప్రభాస్ కి కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఈయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా అటెన్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.. అలాంటి డైరెక్టర్ చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రస్తుతం ఈయన పాన్ఇండియా స్టార్ హీరో ప్రభాస్తో స్పిరిట్ మూవీ ని తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాను ఎప్పుడూ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, పౌజి సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత స్పిరిట్ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తిచేసుకొని ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే సందీప్ రెడ్డివంగ ప్రభాస్ కి కొన్ని కండిషన్లు అయితే పెట్టారట. ఈ సినిమా షూటింగ్ కి రావడానికి లేట్ అయిన పర్లేదు.. ఒకసారి షూటింగ్ సెట్స్ కొస్తే ఇక సినిమా పూర్తి అయ్యేంతవరకు ఈ సినిమా మీదే ఫోకస్ పెట్టాలని కండిషన్ను పెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఆ గెటప్ ని కనక చేంజ్ చేస్తే మళ్ళీ అందులో చాలా వేరియేషన్స్ అయితే వస్తాయట… అలా చేయడంవల్ల సినిమా మొత్తం క్లబ్ అవుతుందని సందీప్ వంగా భావిస్తున్నారు.. అందుకే సినిమా పూర్తి అయ్యేంతవరకు ప్రభాస్ ఎక్కడికి వెళ్ళకూడదని సీరియస్ కండిషన్ పెట్టాడట. ప్రభాస్ ని ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో బోల్డ్ గా చూపించడానికి కూడా సందీప్ రెడ్డి వంగా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రభాస్ అభిమానులు ఆ సీన్స్ ను చూసి ఎలా స్పందిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం అయితే ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు జపం చేస్తున్నారు. అటు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటినుంచే పెరిగిపోతున్నాయి. మరి ఫ్యాన్స్ కి రీచ్ ఎలా సినిమా ఉంటుందా, లేదా,చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: