కోలీవుడ్ యంగ్ హీరో కార్తి తెలుగు, తమిళం అనే తేడా లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా తనకు నచ్చిన కథలు ఓకే చేస్తూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఇక గత ఏడాది ‘సత్యం సుందరం’సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఇదిలావుండగా మన దక్షిణాదిన ఎంతోమంది సంచలన దర్శకులు ఉన్నారు.. కానీ యూనివర్స్ అనేది ఒకటి క్రియేట్ చేయవచ్చు.. ఓ సినిమా పాత్రలను మరో సినిమాలోకి తీసుకురావచ్చనే ఐడియా మాత్రం లోకేష్ కనకరాజ్ పరిచయం చేశారు. తనకంటూ ఓ సినీ ప్రపంచాన్ని క్రియేట్ చేసారు. అదే దారిలో ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు కూడా వెళ్తున్నారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ లాంటి సినిమాలతో లోకేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు ఈయనతో సినిమా చేయాలని ప్రతి ఒక హీరో అత్రుతగా ఉన్నారు. కాగా ప్రజంట్ లోకేష్ రజినీకాంత్‌తో ‘కూలీ’ చిత్ర షూటింగ్‌లో బీజిగా ఉన్న లోకెష్.. ‘ఖైదీ 2’ తో పాటు ‘విక్రమ్ 2’, ‘లియో 2’ కూడా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ముందుగా ‘ఖైదీ 2’తో రాబోతున్నాడు లోకేష్.ఇదిలావుండగా 2019లో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన ‘ఖైదీ’ మూవీ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో మనకు తెలిసిందే. మొత్తానికి ‘ఖైదీ 2’ కూడా పట్టాలెక్కుతోంది. కాగా తలైవా తో ‘కూలీ’ సినిమా పూర్తయిన వెంటనే దీనికోసమే రంగంలోకి దిగనున్నారు లోకేష్. ఇక ఇప్పటికే సూర్య ఈ చిత్రంలో రోలెక్స్ పాత్రతో సందడి చేయనున్నట్లు వార్తలు బయటకు రాగా. ఇప్పుడీ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతుంది. అదేమిటంటే ఖైదీ సినిమా కోసం నలుగురు హీరోలు రానున్నారు. ఖైదీ సినిమాకు విక్రమ్, రోలెక్స్ పాత్రలకు లింక్ పెట్టి కమల్ హాసన్, సూర్య, ఫహద్ ఫాసిల్ లుకూడా ఖైదీ 2 లో కనిపించేలా ప్లాన్ చేస్తున్నాడట లోకేష్. అలాగే తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇప్పించాలని అనుకుంటున్నారట.ఇదే కనక నిజమయితే నలుగురు హీరోలు సినిమాలో ఉండటమే కాక ఇంకో స్టార్ హీరోతో వాయిస్ చెప్పించడంతో ఖైదీ 2 తమిళ్ లో భారీ సినిమాగా మారి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటుంది.ప్రస్తుతం ఈ వార్త తమిళ మీడియాలో  వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: