టాలీవుడ్లో తన నటనతో అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సమంత..తన యాక్షన్ పర్ఫామెన్స్ తో కూడా అందరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. గత ఏడాది సిటాడెల్ వెబ్ సిరీస్లో నటించి మంచి ఆదరణ లభించింది. ఇందులోని నటనతో టాలీవుడ్ ఆడియన్స్ నే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సమంత. ఈ వెబ్ సిరీస్ కోసం మొదటిసారి హీరో వరుణ్ ధావన్ తో కలిసి జోడిగా నటించింది. తాజాగా సమంతకు సంబంధించి ఐకానిక్ గోల్డ్ అవార్డు కూడా అందుకున్నట్లు తెలుస్తోంది.


అంతేకాకుండా ఈ సిరీస్ కు బెస్ట్ వెబ్ సిరీస్ అవార్డు అందుకున్నట్లు ఇటీవలే డైరెక్టర్ డీకే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ ను ఆడియన్స్ ముందుకి తీసుకురావడానికి తాము చాలా కృషి చేశామని.. ఆ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు లభిస్తూ ఉండడంతో తమకు చాలా ఆనందంగా ఉందని మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ డీకే తెలియజేశారు. సమంత అవార్డు విన్నర్ అని  విన్న వెంటనే సమంత అభిమానులు కూడా సమంతకి విషెస్ తెలియజేస్తూ ఉన్నారు.


ఈ సిరీస్ లో సమంత తన యాక్షన్స్ సన్నివేశాలతో పాటు గ్లామర్ తో కూడా మరింత హైలెట్గా నిలిచింది. అనారోగ్య సమస్యల వల్ల కూడా సమంత ఇందులో చాలా కష్టపడి నటించింది.. దీంతో సమంత కష్ట ఫలితానికి సైతం ఇప్పుడు ఫలితం లభించింది అంటూ అభిమానులు కూడా తెలియజేస్తున్నారు.వ్యక్తిగతంగా కూడా సమంత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ తన కెరియర్ పరంగా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో కేవలం మా ఇంటి బంగారు అనే సినిమాలో నటిస్తూ ఉన్నది. ఈ సినిమా షూటింగ్ కూడా కొన్ని కారణాల చేత ఆలస్యం అవుతూ ఉన్నదట. అలాగే మరొక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఉన్నది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: