ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం అనవసరం. ఈ అందాల భామ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించింది. రకుల్ తన అందం, అభినయంతో అందరి మనసు దోచుకుంది. ఎన్నో సినిమాల్లో గ్లామర్ రోల్స్ పోషిస్తూ ప్రేక్షకులను అలరించింది. ఈ బ్యూటీ 'కొండపొలం' తర్వాత తెలుగు పరిశ్రమ నుండి దూరంగా వెళ్లింది. అయితే ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఈమె ప్రస్తుతం ఇతర భాషలలో నటిస్తుంది.
ఇక ఈ బ్యూటీ గతేడాది ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకుంది. జాకీ భగ్నని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రకుల్ ప్రీత్ సింగ్ గోవాలోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. అయితే ఈమె స్టార్ హీరోయిన్ అయినప్పటికీ.. చాలా సింపుల్ గా వివాహం చేసుకోవడంతో, చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇక తాజాగా తాను అంతా సింపుల్ గా పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని బయట పెట్టింది. అలాగే పెళ్లిలో నో ఫోన్ పాలసీ పెట్టడానికి కూడా రీజన్ ఏంటో తెలిపింది.
'పెళ్లిని చాలా సింపుల్ గా చేసుకోవాలని నేను, జాకీ ఎప్పటినుంచో అనుకున్నాము. సింపుల్ గా వివాహం చేసుకోవడమే మాకు ఇష్టం. లగ్జరీ కంటే కూడా సౌకర్యం ముఖ్యం. పెళ్లి సమయంలో జాకీ, నేను విలువైన క్షణాలను ఎంజాయ్ చేశాము. సింపుల్ గా పెళ్లి చేసుకోవడంలో ఒక గొప్ప ఆనందం ఉంటుంది. వివాహం జరిగిన మూడు రోజు మేము మా జీవితంలో బెస్ట్ గా ఉండాలి అనుకున్నాం.  అలాగే మాతో పాటుగా వివాహానికి మమ్మల్ని దీవించేందుకు వచ్చిన పెద్ధలు కూడా ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాము. అందుకనే నో ఫోన్ పాలసీ పెట్టాము అంతే. కానీ మా పెళ్లి ఫోటోలు లీక్ చేస్తారని కాదు. అలాగే మా వేడుక చిత్రాలను అందరికన్నా ముందు మేమే పంచుకోవాలి అని అనుకున్నాము. మేము పెళ్లిలో చాలా డ్యాన్స్ చేశాము' అని రకుల చెప్పుకొచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: