
ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే పాపులర్ ఆన్లైన్ ఎన్‌సైక్లోపీడియా వికీపీడియాలో చత్రపతి శంభాజీ మహారాజ్ గురించి అభ్యంతరకరమైన కంటెంట్ పై మహారాష్ట్రలో వివాదం చల్లరేగింది .. ఇక దీనికి ప్రతిస్పందనగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం రాష్ట్ర పోలీసులను వికీపీడియాను సంప్రదించి కంటెంట్ తొలగించాలని చర్యలు తీసుకోమని ఆదేశించారు . సీఎం ఆదేశాలతో మహారాష్ట్ర సైబర్ పోలీసులు వికీపీడియాకు నోటీసులు పంపించారు .. సదరు కంటెంట్ ను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. వికీపీడియా వంటి ఓపెన్ సోర్స్ ప్లాట్ఫారంలో తప్పుడు సమాచారం మంచిది కాదని చారత్రిక వాస్తవాలను వక్రీకరించడాన్ని ప్రభుత్వం సహించదని సీఎం ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు .. అలాగే శంభార్జీ మహారాజ్ పై అభ్యంతరకర కంటెంటేను తొలగించాలని తాను వికీపీడియా అధికారులను కోరినట్టు చెప్పుకొచ్చారు చరిత్రకారుల కథనాన్ని వక్రీకరించకూడదని ఆయన అన్నారు.
అలాగే ఆన్లైన్లో వికీపీడియా సమాచారం ఏదైనా ఓపెన్గా ఎడిట్ చేసుకోవచ్చని ఆప్షన్ ఉంది .. ఇలా ఎడిట్ చేసినప్పుడు ఆ తప్పుడు సమాచారం ఎవరు రాశారని విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది .. వికీపీడియాలో సమాచారాన్ని ఎవరికి వారు స్వచ్ఛందంగా ఎడిట్ చేస్తున్నారు .. వాస్తవాలను వక్రీకరించకుండా నిరోధించడానికి కఠిన నిబంధనలు అమలు చేయాలని సీఎం ఫడ్నవీస్ అన్నారు. అలాగే వికీపీడియాకు రాస్తున్న లేఖలో మహారాష్ట్ర సైబర్ విభాగం .. కంటెంట్ మత విద్వేషాన్ని రెచ్చగొడుతుంది ఎందుకంటే చత్రపతి శంభాజీ మహారాజ్ భారత దేశంలో అత్యంత గౌరవనీయులు .. అలాంటి వారిపై తప్పుడు సమాచారం చత్రపతి అభిమానుల్లో అశాంతిని కలిగిస్తుంది శాంతి పద్ధతులకు ముప్పు తలెత్తే అవకాశం ఉంటుంది .. సకాలంలో దీనిపై స్పందించకపోతే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేమని అన్నారు చావా సినిమాతో ముడి పెడుతూ వికీలో ఉంటెంటేని ప్రజలు విశ్లేషించడంతో .. దీనిపై ఇప్పుడు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.