
అలాగే ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న టాక్ ప్రకారం హరిహర వీరమల్లు సర్వాయి పాపన్న గౌడ్ కథ ఆధారంగా రాసుకున్నారట ... ఈ గొప్ప యోధుడి పూర్తి పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ .. 1650 లో జన్మించిన శైవ మతస్థుడే అయినప్పటికీ కులాలు , మతాలకతీతంగా ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. తురుష్క్ సైనికులు పన్నులు వసూలు చేసే క్రమంలో కళ్ళు గీసే వ్యాపారం చేస్తున్న పాపన్నతో ఒక స్నేహితుడు వల్ల వారితో తగు పెట్టుకుంటాడు .. దీంతో విసుకు చెంది ఉగ్రరూపం చెందిన పాపన్న వాళ్ళ తల నరకడమే కాకుండా ఊరు వాడ ఏకం చేసి మూడు వేల మందితో పెద్ద సైన్యాన్ని తయారు చేసుకుంటాడు ..
మహారాష్ట్రలో చత్రపతి శివాజీకి సమానంగా మొగల్ సామ్రాజ్య ఒంటెద్దు పోకడలపై యుద్ధం చేసి గెలిచిన ఖ్యాతి ఈయన పేరు మీద ఉంది .. అలాగే 1700 సంవత్సరం సమయంలో గోల్కొండ దాకా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 20 దాకా కోటలను గెలుచుకున్న పాపన్న సాహసాలకు నిజాం రాజులు సైతం జడిసిపోయారు. ఇలా అప్రతిహతంగా జరిగిపోతున్న పాపన్న జైత్రయత్రలో చావాలో శంబాజీకి జరిగినట్టే పాపన్నకు ఇంటి వారితోనే ద్రోహం జరిగి పట్టుపడ్డాడు .. ఆ తర్వాత జరిగేది ఊహకు అందనంత గొప్పగా ఉంటుందట .. ఇక్కడ చెప్పింది కొన్ని విషయాలే కానీ హరిహర వీరమల్లు కోసం కేవలం పాపన్నకు సంబంధించిన ప్రధాన నేపథ్యాన్ని మాత్రమే తీసుకొని ఎన్నో మార్పులు చేశారని తెలుస్తుంది .. అధికారికంగా సర్వాయి పాపన్న కథ అని టీం ప్రకటించినప్పటికీ .. ఊహించని విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఎప్పుడూ చూడని అబ్బురపరిచే యాక్షన్ ఎపిసోడ్ చాలానే ఉంటాయట .. అలాగే బాహుబలి తరహాలో మొదటి భాగానికి మించి సీక్వెల్ కోసం ఎదురుచూసే స్థాయిలో ఎండింగ్ ఉండబోతుందట.