
మణిశర్మ అంటే తెలియని వారుండారు. ఆయన సంగీతం అంటే చాలా మంది పడి చచ్చిపోతారు. ఈయన 200కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. మణిశర్మకి సాలూరి రాజేశ్వర రావు దగ్గర నుండి వందేమాతరం శ్రీనివాస్ వంటి వారి దగ్గర పని చేసిన అనుభవం ఉంది. ఇక ఈయన మంచితనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక మరోసారి మణిశర్మ తన గొప్ప మనసును చాటుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవిపైన ఉన్న అభిమానాన్ని కూడా ఆయన అందరికీ చాటుకున్నారు. వీరిద్దరూ చూడాలని ఉంది, ఇద్దరు మిత్రులు, అన్నయ్య , మృగరాజు, ఇంద్ర, అంజి, ఠాగూర్, జై చిరంజీవ, స్టాలిన్, ఆచార్య సినిమాలు కలిసి చేశారు. అందులో ఇంద్ర, ఠాగూర్, అన్నయ్య, చూడాలని ఉంది, బావగారు బాగున్నారా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి.
మణిశర్మ రక్తదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'ఎప్పటినుంచో నేను రక్తదానం చేయాలి అని అనుకున్నాను. నేను మెగాస్టార్ చిరంజీవి చాలా సినిమాలకు సంగీతం అందించాను. అలా సంగీతం అందించి ఆయనపై నాకున్న అభిమానాన్ని చాటుకున్నాను. ఇప్పుడు రక్తదానం చేసి మరోసారి అభిమానాన్ని చూపించను. నాకు రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉంది.బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా లక్షలాది మందిలో నేను భాగమయ్యాను. ఇలాంటి మంచి కార్యక్రమాలలో అందరూ భాగం కావాలి' అని మణిశర్మ చెప్పుకొచ్చారు.