
అలా తెలుగు ఇండస్ట్రీ నుంచి తమిళ్ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయిన ఈమె గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగానే ఉన్నది. ఇటీవలే కూల్ సురేష్ హీరోగా నటించిన సినిమా ప్రారంభానికి హాజరైన ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇటీవలే బ్యాడ్ గర్ల్ అనే టీజర్ విడుదల అవ్వగా ఈ టీజర్ మీద కూడా చాలా నెగిటివ్గా కామెంట్స్ వినిపించాయి. ఈ టీజర్ బోల్డ్ గా ఉందని.. ఈ సినిమా ఎగ్జామ్పుల్ కాదని ఇదొక చెత్త ఉదాహరణ అంటూ ఆమె వెల్లడించింది.. ఎందుకంటే స్వేచ్ఛ , లింగ సమానత్వం అనే అంశాలను కూడా తప్పుగా చూపించారని వెల్లడించింది.
అబ్బాయిలతో పోటీపడి మరి మద్యం సేవించడం సిగరెట్టు తాగడం వంటివి సమానత్వం అని ఎవరు అనరు.. సమానత్వం అంటే అన్నిటిలో సమానంగా కూడా గౌరవించాలని తెలిపింది.. ముఖ్యంగా హీరోని సంప్రదించే విధానం, హీరోయిన్లను సంప్రదించే విధానం కూడా ఒకేలా ఉండాలని తెలిపింది.. ఉదాహరణకు తరలి తీసుకోండి సినిమాలో నటించమని పిలవడానికి బదులుగా చాలామంది వారితో కలిసి రాత్రి గదిలో గడపమని పిలుస్తున్నారని ఇది సమానత్వమా అంటూ వెల్లడించింది. అసలు బ్యాడ్ గర్ల్ టీజర్ కూడా అమ్మాయిలను చెడగొట్టేలా ఉన్నదని బాధ్యతమైన చిత్రాలు తీయవలసిన నిర్మాతలు అందుకు బదులుగా ఈ చిత్రాన్ని మీకి నిధులు సమకూర్చడం తీవ్ర నిరాశకు చెందేలా చేసిందని తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్విట్ వైరల్ గా మారుతున్నది.