తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లోని నటనకు గాను విశ్వక్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ మూవీ తర్వాత ఈయన పలకనామ దాస్ అనే సినిమాలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత ఈయన చాలా కాలం పాటు నటించిన సినిమాలు చాలా వరకు విజయాలను అందుకున్నాయి.

కొన్ని సినిమాలు భారీ విజయాలను అందుకోకపోయినా నిర్మాతలకు మాత్రం మంచి లాభాలను తీసుకువచ్చాయి. దానితో తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో మినిమం గ్యారంటీ హీరో గా విశ్వక్ పేరు సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు మంచి దశలో కెరీర్ ను ముందుకు సాగించిన ఈ నటుడు ఈ మధ్య కాలంలో మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో వరసగా విఫలం అవుతున్నాడు. కొంత కాలం క్రితం విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక కొంత కాలం మెకానిక్ రాఖీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే తాజాగా లైలా మూవీ తో విశ్వక్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఘోరమైన నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ భారీ డిజాస్టర్ అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈయన వరుసగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలలో నటిస్తున్నాడు. అందుకే ఈయనకు వరుసగా అపజాయలు వస్తున్నాయి అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs