
వైశాలి సినిమాలో తన చావుకి కారణమైన వారందరిని నీటి రూపంలో రివేంజ్ తీర్చుకుంటుంది.. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా శబ్దం తెరకెక్కించారు. తాజాగా శబ్దం ట్రైలర్ విడుదల చేయగా ఇందులోని సన్నివేశాలు అన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉండడమే కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ హర్రర్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్ విషయానికి వస్తే.. ఒక వెయ్యి గబ్బిలాలు చెవులో అరుస్తున్నట్టుగా ఉంది డాక్టర్ అని ఒక అమ్మాయి చెప్పే డైలాగ్ తో మొదలవుతుంది. శబ్దం మూవీతో ఈసారి ఆది పినిశెట్టి భయపెట్టేలా కనిపిస్తున్నారు.
ఇందులో చెప్పే డైలాగులు చనిపోయాక కూడా ఇంకొక జీవితం ఉంటుంది అనేది చాలా ఎమోషనల్ గా ఆకట్టుకుంటున్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ నెల 28వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో తమిళ్, హిందీ ,కన్నడ వంటి భాషలలో కూడా రిలీజ్ చేయబోతున్నారట. మరి ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో ఎన్ సినిమాస్ వారు విడుదల చేస్తున్నారట. మరి ఏ మేరకు థియేటర్లో మెప్పించి ఆది పినిశెట్టి కి సక్సెస్ అందిస్తుందో చూడాలి మరి. ఇందులో ఆది పినిశెట్టి కూడా ఈసారి డిఫరెంట్ పాత్రలో కనిపిస్తూ ఉన్నారు.