విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ టాక్ ను తెచ్చుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇప్పటికే సొంతం చేసుకుంది. ఈ మూవీ సీడెడ్ ఏరియాలో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా సీడెడ్ ఏరియాలో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 8 వ స్థానంలో నిలిచింది. మరి సీడెడ్ ఏరియాలో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన చేసిన టాప్ 10 సినిమాలు ఏవి ..? అందులో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ సీడెడ్ ఏరియాలో 51.04 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ 35.70 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి పార్ట్ 2 మూవీ 34.75 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ 31.85 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ పార్ట్ 1 మూవీ 22.75 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలోనూ , ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి పార్ట్ 1 మూవీ 21.8 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలోనూ , ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా 21.8 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలోనూ , వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 19.15 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలోనూ , చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా 19.11 కోట్ల కనెక్షన్లతో 9 వ స్థానంలోనూ , చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా 18.35 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలో కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: