ఈ మధ్యకాలంలో చాలామందికి పెళ్లి కాకుండానే అన్ని రకాల రిలేషన్స్ మొదలుపెట్టి అన్ని అర్థం చేసుకొని చివరికి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలా పెళ్లి కాకుండానే చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న జంటల్లో అక్కినేని అఖిల్  ఒకరు.. ఈయన పెళ్లి కాకుండానే జైనబ్ రావడ్జీతో సీక్రెట్ గా అన్ని పనులు కానిచ్చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..ఆ వివరాలు ఏంటో చూద్దామా.. అఖిల్ అక్కినేని సినిమాలపరంగా చాలా డల్ అయినా కానీ  ఆయన పేరు ఎంతో పాపులర్ గా ఉంది..అయితే ఈయన ముందుగా ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని దాన్ని క్యాన్సల్ చేసుకున్నారు. ఆ తర్వాత జైనబ్ రావడ్జీతో నిశ్చితార్థం   చేసుకున్నారు..

 అయితే వీరి నిశ్చితార్థ  కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఫోటోలను తన తండ్రి నాగార్జున అధికారికంగా బయట పెట్టారు.. దీంతో వీరి పెళ్లి జరగబోతుంది అని డిసైడ్ అయింది..  తాజాగా తన అన్న నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల పెళ్లి కావడంతో వీరి పెళ్లికి కూడా లైన్ క్లియర్ అయిపోయింది. త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే తరుణంలో  అక్కినేని అఖిల్ తనకు కాబోయే భార్య జైనబ్ తో  తాజాగా ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు.. ఇంకేముంది కొంతమంది అభిమానులు పెళ్లికి ముందే అన్ని కానిచ్చేస్తున్నారా, పెళ్లికి ముందే వెకేషన్స్ అంటూ సీక్రెట్ గా  తిరగడం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు..

ఇక కొంతమంది అయితే  పెళ్లి కాకముందే అఖిల్  జైనబ్ తో హనీమూన్ వెళ్తున్నారు అంటూ  స్పష్టం చేశారు.. ఈ విధంగా  నేటిజన్స్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ఇక అక్కినేని అఖిల్ సినిమా విషయాలకు వస్తే..ప్రస్తుతం ఆయన మురళీ కిషోర్ అబ్బురు డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఓ పోరాట యోధుడి బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: