కొన్నిసార్లు మన టైం బాగోలేకపోతే ఇంటికి వచ్చిన అదృష్టాన్ని కూడా తరిమేస్తూ ఉంటాము . అలా చాలామంది హీరోలు - హీరోయిన్ లైఫ్ లో జరుగుతూ ఉంటాయి.  కాగా టాలెంట్ ఉన్న బిగ్ బడా స్టార్ హీరోస్ మాత్రం ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు . ఒక సినిమాని రిజెక్ట్ చేయాలి అంటే దానికి అసలు కారణాలు ఏంటి అని ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు . ఒకవేళ ఈ సినిమా రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ ఆ సినిమా వేరే హీరో చేస్తే హిట్ అయినా మనం బాధపడకూడదు . అలాంటి ఒక స్ట్రాంగ్ రీజన్ తోనే రిజెక్ట్ చేస్తాడు.


అలాంటి రీజన్ తోరిజెక్ట్ చేసే టాలీవుడ్ ఏకైక హీరో మాత్రం మహేష్ బాబు అని చెప్పాలి.  మహేష్ బాబు తన కెరీర్ లో చాలా సినిమాలు హిట్లు అందుకున్నాడు . ఫ్లాప్స్ కూడా అందుకున్నాడు . అయితే ఏ సినిమా ఫ్లాప్ అయినా సరే ఆయన బాధపడలేదు . ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు మిగతా హీరోలు చేసి సక్సెస్ అందుకున్న కూడా బాధపడలేదు. కాగా రీసెంట్ గా ఇప్పుడు మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది . మహేష్ బాబు ఇంటికి వచ్చి కథ వినిపించిన డైరెక్టర్ .. ఇప్పుడు వేరే హీరోతో ఆ సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా వంద కోట్లు కలెక్ట్ చేసి సక్సెస్ఫుల్గా థియేటర్స్ లో రన్ అవుతున్న న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.



మూవీ మరేంటో కాదు..  రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన చావా సినిమా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . వంద కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా ముందుకెళ్లడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమాని ముందుగా డైరెక్టర్ మహేష్ బాబుకు వివరించారట. పాన్ ఇండియా  సినిమా గా తెరకెక్కించాలి అంటూ భావించి మహేష్ బాబు అయితే ఈ రోల్ కి  బాగుంటాడు అంటూ ఆశపడ్డారట.  కానీ మహేష్ బాబు హిస్టారికల్ నేపథ్యం ఉన్న సినిమాలు చేయడం ఇష్టం లేక రిజెక్ట్ చేశారట . అలా మంచి సినిమా  మిస్ చేసుకున్నాడు హీరో మహేష్ బాబు..!

మరింత సమాచారం తెలుసుకోండి: