
ప్రజెంట్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ప్రజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది . ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరొక బిగ్ బడా దర్శకుడితో సినిమా కి కమిట్ అయినట్లు తెలుస్తుంది. రీసెంట్ గానే బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా దర్శకుడితో సినిమాకి కమిట్ అయిన.. ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తో ఆయన గతంలో మిస్ చేసుకున్న సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి .
రామ్ చరణ్ ..చిరుత అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మగధీర సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. రెండవ సినిమాతోనే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఖాతాలో వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు . కాగా ఈ సినిమాలో రాజమౌళి ముందుగా కాజల్ అగర్వాల్ కన్నా బాలీవుడ్ క్వీన్ హీరోయిన్ కంగనా రనౌత్ ని అనుకున్నారట . కానీ ఆమె ఈ స్తోరీ విని ఓకే అన్నా కూడా కాల్ షీట్స్ అడ్జెస్ట్ కాక రిజెక్ట్ చేసిందట . రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి కంగనా అంటే చాలా చాలా ఇష్టం . ఆమె నటన .. యాక్టింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టంగా లైక్ చేస్తూ ఉంటారు . ఆ విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకొచ్చారు . కాగా విజయేంద్రప్రసాద్ సలహాతోనే ఈ రోల్ కోసం ఆమెను అప్రోచ్ అయ్యారట రాజమౌళి. కానీ రిజెక్ట్ చేసింది. అలా వీళ్ళ కాంబోలో రావాల్సిన సూపర్ డూపర్ హిట్ సినిమా మిస్ అయిపోయినట్లు అయ్యింది..!!