ఛావా’ సూపర్ సక్సస్ తో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ టాప్ హీరోగా మారిపోయాడు. ఛత్రపతి శివాజీ కొడుకు శంభు మహరాజ్ జీవితం పై తీసిన ఈ బయోపిక్ కు బాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనాలు ఇస్తూ ఉండటంతో ఈ మూవీ కలక్షన్స్ పరుగులు తీస్తున్నాయి. నెటితరం ప్రేక్షకులు చారిత్రాత్మక సినిమాలను చూడరు అన్న నమ్మకాన్ని ‘ఛావ’ మరొకసారి తప్పు అని రుజువు చేసింది.



ఇలాంటి పరిస్థితుల మధ్య మహేష్ అభిమానులకు ‘ఛావ’ సక్సస్ ఒకకొత్త ఆలోచనలను రేకెత్తించింది. సూపర్ స్టార్ కృష్ణ టాప్ హీరోగా కొనసాగుతున్న రోజులలో ‘ఛత్రపతి’ శివాజీ బయోపిక్ ను తీయాలని చాల ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో తెలుగు సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లేదు. దీనితో అలాంటి భారీ బడ్జెట్ సినిమా తీయడం మంచిది కాదని కృష్ణకు సలహాలు రావడంతో అప్పట్లో ఆలోచన విరమించుకున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది.



దీనికితోడు మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్ లో ఒక భారీ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ సుమారు 1000 కోట్ల భారీ పెట్టుబడితో తీస్తున్న ఈ మూవీతో మహేష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోవడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ మూవీ తరువాత మహేష్ చేయబోయే సినిమాలు అన్నీ పాన్ ఇండియా స్థాయిలో ఉంటాయి.



దీనితో మహేష్ తన తండ్రి కోరిక నెరవేరుస్తూ ‘ఛత్రపతి శివాజీ బయోపిక్ లో నటిస్తే బాగుంటుంది కదా అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ హీరోకి సూచనలు చేస్తున్నారు. గతకొంతకాలంగా యూత్ దేశభక్తి సినిమాలను చారిత్రాత్మక సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎవరైనా ఒక ప్రముఖ దర్శకుడు శివాజీ జీవిత చరిత్రను సినిమాగా తీయాలని సాహసం చేయాలి అనుకున్నా అది రాజమౌళి మహేష్ తో తీస్తున్న సినిమా తరువాత మాత్రమే నెరవేరే ఆస్కారం ఉంది..  






మరింత సమాచారం తెలుసుకోండి: