పవన్ కళ్యాణ్ .. ఏపీ డిప్యూటీ సీఎం గా తనకంటూ ఇప్పుడు స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడు అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన చేసే పని ఏదైనా సరే అందులో పర్ఫెక్ట్ గా ఉండడానికి నిర్ణయించుకుంటాడు . అదేవిధంగా ముందుకు వెళ్తాడు . కాగా ఏపీ రాజకీయాలలో గేమ్ ఛేంజర్ గా మారిపోయి ఈసారి కూటమి ప్రభుత్వం చేపట్టే విధంగా మార్చిన ఘనత కేవలం పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది. ఆ విషయాని  మరొకసారి గుర్తు చేసుకోక తప్పదు.


ఇప్పుడు ఏపీ పొలిటికల్ రంగంలో పవన్ కళ్యాణ్ పేరు మారు మ్రోగిపోతుంది.  పవన్ కళ్యాణ్ రీసెంట్గా మహాకుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించారు . దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయి . పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా వెళ్లి పుణ్య స్నానం ఆచరించారు . హారతి కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన పిక్చర్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫిజిక్ పై టూ వల్గర్ చీప్ గా కామెంట్స్ చేస్తున్నారు .



సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ట్రోల్ అవుతూనే ఉంటారు . అయితే పవన్ ఫ్యాన్స్ దాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంటారు . కాగా ఈసారి ఎప్పుడూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఫిజిక్ పై దారుణతి దారుణంగా కామెంట్స్ చేస్తూ ఉండడం ట్రోల్ చేస్తూ ఉండడం ఫ్యాన్స్ కి హర్టింగ్ గా ఉంది . మరీ ముఖ్యంగా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన తర్వాత హారతి ఇస్తూ ఉన్న పిక్చర్స్ పై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.  పవన్ కళ్యాణ్ పొట్ట ఏంటి అంత ముందుకు వచ్చింది ..? పవన్ కళ్యాణ్ ఏంటి ఇంత లావు అయిపోయాడు.. పవన్ కళ్యాణ్ కి హీరో ఫిజిక్ నే లేదే.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాగా మారిపోయాడు అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . కొంతమంది పాజిటివ్ వే లో ఆ కామెంట్స్ చేస్తుంటే..మరికొందరు నెగిటివ్ వే లో ఆ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన్ను దారుణంగా టార్గెట్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: