
పవర్‌ఫుల్ యాక్షన్‌తో రాబోతున్న 'OG' సినిమాను rrr ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఇటీవల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు ఆలయాలను సందర్శించుకున్నారు. ఇక ఈ క్రమంలో ఆయన ఓ నదిలో తీసుకున్న ఫోటోలో పవన్ కళ్యాణ్ పొట్ట కనిపించింది. ఇంకేం ఉంది అది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకప్పుడు ఎన్టీఆర్ బాగా లావుగా ఉన్నడని బాడీ షేమింగ్ చేశారు కదా.. ఇప్పుడేం అంటారు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక దీనికి జనసైనికులు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే ఉండేది.. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వయసు 53 ఏళ్లు ఉంది. ఈ వయసులో పొట్ట రావడం మామూలే అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇచ్చిపడేశారు.