ఈ మధ్య కాలంలో చాలా మంది తెలుగు సినిమా ఇండస్ట్రీ  హీరోలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరిగా అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవల యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ అయిన రహస్య గోరఖ్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నటుడు అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి కూడా జరిగింది. ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా ఇంటివాడు కాబోతున్నాడు. గతంలో అఖిల్ కు నిశ్చితార్థం జరగా పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇటీవలే జైనబ్‌ రవ్జీతో నిశ్చితార్థం కూడా జరిగింది. యంగ్ హీరో అక్కినేని అఖిల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.  అఖిల్, జైనబ్‌ రవ్జీతో పెళ్లి కూడా నాగచైతన్య లాగానే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే పెళ్లి వివాహం ఘనంగా జరగనుందని సమాచారం. వచ్చే నెలలో అఖిల్ పెళ్లి జరుగుతుందని సమాచారం. వీరి వివాహం మార్చి 24న జరగనున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కానీ ఇంకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా అక్కినేని అఖిల్ తనకు కాబోయే భార్య జైనబ్‌ రవ్జీతో కలిసి ఎక్కడికో వెళ్తున్నట్లు ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దీంతో అందరూ పెళ్లి షాపింగ్ కోసం ఇద్దరు కలిసి వెళ్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. ఇక అఖిల్ చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సిసింద్రీ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అఖిల్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. అనంతరం హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ సినిమాలు చేశాడు. అఖిల్ ఇలా వరుసగా సినిమాలు చేసినప్పటికీ.. అంతా పెద్ద హిట్స్ ఏం సాధించలేదు. పెళ్లి తర్వాత అయిన అఖిల్ కి కలిసి వస్తుందేమో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: