
అటు ఎన్టీఆర్ ఇటు ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాలతో కెరీర్ బెస్ట్ హిట్లను సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఈరోజు నించి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలలో పుష్ప ది రూల్ మూవీ కలెక్షన్ల విషయంలో టాప్ లో ఉంది. పుష్ప ది రూల్ మూవీ ఫుల్ రన్ లో ఏకంగా 1871 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం సినిమాలకే పూర్తిస్థాయిలో పరిమితమయ్యారు. తారక్ సినిమాల రిలీజ్ డేట్లు మారుతున్నా సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుండటం గమనార్హం. ఎన్టీఆర్ కు జోడీగా రుక్మిణీ వసంత్ ఎంపిక కావడం జరిగింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్ విషయంలో వేరియేషన్ చూపించనున్నారని భోగట్టా. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో బొద్దు లుక్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మెప్పిస్తుండటం గమనార్హం. దేవర2 సినిమా విషయంలో ఎన్టీఆర్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి.