
రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. దీనితో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ డీలా పడిపోయారు. నిజానికి వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీ రిలీజ్ కావాలి . అదేవిధంగా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్ . కానీ కొన్ని అనివార్య కారణాలు చేత ఈ ఆగస్టు 14న రిలీజ్ చేయడం కష్టంగా భావించారట మూవీ టీం. ఈ ఆకారణంగానే డిసెంబర్లో రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14 రిలీజ్ కాకుండా డిసెంబర్లో రిలీజ్ అవ్వబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది.
అయితే ఆగస్టు 14వ తేదీ రజనీకాంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న "కూలీ" సినిమా విడుదల చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది . టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాపై కేవలం తమిళ్ ఆడియన్స్ కాదు తెలుగు జనాలు కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఆగస్టు 14వ తేదీ సినిమా రిలీజ్ కాబోతుంది అని తెలియడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . మరొకపక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ డీలా పడిపోతున్నారు . ఏంటో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. గతంలో దేవర సినిమా కూడా ఎన్నిసార్లు వాయిదా పడిందో అందరికీ తెలిసిందే..!