
ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నటువంటి తాజా చిత్రం శివంగి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ దేవరాజ్ భరణి ధరన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆనంది పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ ని డైరెక్టర్ అనిల్ రావు పూడి రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టల్ వైరల్ గా మారడంతో ఇక్కడ ఉన్నది హీరోయిన్ ఆనంది నేనా ఏం లేదు గుర్తు పట్టలేక పోయామంటూ అభిమానులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆనంది నల్ల లుంగి, చొక్కాతో కాలు పైన కాలు వేసుకుని మరి కళ్ళజోడు పెట్టుకొని చాలా డైనమిక్ లుక్ లో సోఫాలో కూర్చొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇన్ని రోజులు చాలా కూల్ గా క్యూట్ గా కనిపించిన ఆనంది ఒక్కసారిగా ఇలా మాస్ పాత్రలో కనిపించడం ఏంటా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఆనంది లుక్ తర్వాత శివంగి సినిమా పైన భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నదట మార్చి 7వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. మొత్తానికి ఆనందిని గుర్తుపట్టడం కష్టంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కూడా ఎలా ఉంటుందో చూడాలి మరి.