కొందరు టెక్నీషియల్లు ఉంటారు కాలానికి అనుగుణంగా అసలు ఉండరు . అప్డేట్ కావటం అంటే మంచి కాంబినేషన్ వెత్తుకోవటం అని అనుకుంటారు .. ఈ తరం జనాలకు నచ్చే తరహా కొత్త కథ , కథనాల చిత్రీకరణ అసలు అనుకోరు .. తమకు వచ్చిన కథలనే తిప్పి తిప్పి తీస్తూ ఉంటారు . దాంతో వారికి ఎక్కడో ఒక చోట కెరీర్ కు బ్రేక్ పడుతుంది .. మారుతున్న కాలాన్ని ప్రేక్షకులు ఆలోచనలు గమనించిన హీరోలు వాళ్లను పక్కన పెట్టేస్తారు .. దాంతో ఇలా వచ్చిన గ్యాప్లో ఏదో ఒక వార్తల్లోనే గడిపేస్తుంటారు. దర్శకుడు పూరి జగన్నాథ్ మంచి ఫైర్ అన్న దర్శకుడు .. ఆయన దగ్గర నుంచి వచ్చే డైలాగులు తూటాల పేలుతాయి .. యూత్ కు నచ్చే ఆటిట్యూడ్ పాత్రలను ఆయన ఎన్నో సృష్టించారు . ఇదంతా గతం .. ఇప్పుడు ఈ తరహా పాత్రలు మాటలు కథలు ప్రేక్షకులకు బోర్ కొట్టయి .. కానీ ఈ దర్శకుడు కొత్తగా ఆలోచించడం లేదు .. కొత్త కథలు రాయటం పక్కన పెడితే కొత్త తరహా సినిమాలు అనేది కూడా ఈయన అందించలేకపోతున్నారు .. దాంతో ఈయన సినిమాలు కొనక్కున్నవారు కోట్లలో నష్టపోతున్నారు .. అందుకే ఈయనతో సినిమాలు చేయడానికి హీరోలు డేట్లు అసలు ఇవ్వటం లేదు.


అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మరో గ్యాసిప్ ఏమిటంటే .. గోపీచంద్ హీరోగా పూరి ఓ సినిమా చేస్తున్నారని .. అది కూడా కొత్త కథ కాదు గతంలో చేసిన దానికి సీక్వల్ అంటున్నారు .. అయితే ఇక్కడ గోపీచంద్ కు హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది .. ఈయ‌న సినిమాలు చేసి ఎంతమంది నిర్మాతలు గలంతయ్యారు ఎంతమంది బయర్లు కుదెల‌యిపోయారో .. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే వార్తల్లో ఉంటుంది తప్ప వాస్తవ రూపంలోకి రావడం అంత ఈజీ కాదు. మరో దర్శకుడు హరీష్ శంకర్ సినిమాలు కూడా ప్రేక్షకులను బానే ఎంటర్టైన్మెంట్ చేస్తాయి .. గబ్బర్ సింగ్ ఈయన కెరియర్ లోనే ఓ ల్యాండ్ మార్ .. ఆ తర్వాత గద్దల కొండ గణేష్ మరో విజిటింగ్ కార్డ్ .. కానీ ఈ రెండిటిని పక్కకు పెట్టేలా చేసింది మిస్టర్ బచ్చన్ .. రవితేజను చాలా ఫీలయ్యాలా చేసిన సినిమా .. ఈగల్ , టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్ అయిన తాను బాధపడనని .. ఏదో కొత్తగా ట్రై చేసి ఫెయిల్ అయ్యానని .. కానీ మిస్టర్బ‌చ్చ‌న్ అలా కాదని రవితేజ అయ‌న‌ సన్నిహితులు దగ్గర చెబుతూ ఉండేవాడు.. పవన్ తో ఉస్తాద్ అనే సినిమా అలానే వార్త‌ల్లో ఉంది ..  ఎప్పుడు ఏం జరుగుతుందో దాని కే తెలియదు ..


ఇలాంటి క్రమంలో రామ్ తో హరిశంకర్ సినిమా అంటూ వార్తలు కోనేళ్ళ క్రితం మెగాస్టార్ తో సినిమా అనే వార్తలు కూడా వచ్చాయి .. గత డిసెంబర్లో హరీ శంకర్ రామహ‌ని కలిశారు .. అది జస్ట్ క్యాజువల్ డిస్కషన్ ఇన్సైడ్ వర్గాల టాక్ .. రామ్ కూడా అంత సులువుగా ఎవరికి ఒకే చెప్పడు .. ప్రజెంట్ నాగచైతన్య చేస్తున్న విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు కథ ముందుగా రామ్ దగ్గరికి వెళ్ళాడు .. ఆయన నో చెప్పడంతో అది నాగ‌ చైతన్య దగ్గరికి వచ్చింది .. ఇలాంటి క్రేజీ దర్శకుడికే నో చెప్పాడు రామ్.. అలాంటిది హరీష్ శంకర్ కి అంత సులువుగా వర్క్ అవుట్ అయ్యేది కాదు. ప్రశాంత్ వర్మ ది మరో విచిత్రమైన కేసు .. హిట్  వచ్చిన కూడా ఏడాదిగా సినిమా సెట్ అవ్వటం లేదు .. ఒక సినిమా సెట్ అయిన ఆది క్యాన్సిల్ అయింది .. మోక్షు తో సినిమా సెట్ అయినా కూడా సెట్స్ మీదకు వెళ్లడం లేదు .. ప్రభాస్ తో సినిమా అన్నది వార్తల్లోనే ఉంటుంది .. ఈలోగా ప్రభాస్ తో మరిన్ని కాంబినేషన్లో బయటికి వస్తున్నాయి. టాలీవుడ్ లో చాలా కాంబినేషన్లో ఇలా వాస్తులోనే కనిపిస్తున్నాయి .. ఇంకెన్ని సంవత్సరాలు ఇలా కనిపిస్తూ ఉంటాయో..?

మరింత సమాచారం తెలుసుకోండి: