తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి పెద్దయ్యాక సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ చిన్న వయసులో అనేక సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈమె మొదటగా 2022 వ సంవత్సరం విడుదల అయిన మసూద్ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మామూలు అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

మూవీ తర్వాత ఈమె బలగం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలోని నటనకు మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ఈ బ్యూటీ కి దక్కాయి. ఈ మూవీ ద్వారా ఈమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న సమయంలో ఈ బ్యూటీ ఉస్తాద్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ఇప్పటి వరకు ఈమె హీరోయిన్గా మూడు సినిమాల్లో నటిస్తే అందులో రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. కేవలం ఒకే ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఇలా అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. దానితో చాలా మంది ఈమె ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. అందుకే ఈమె సినిమాలు వరుస పెట్టి రావడం లేదు అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kkr