
ఇక ప్రస్తుతం ఈ సినిమా భారీ రికార్డులు కొల్లగొట్టే దిశగా దోచుకుపోతుంది .. ఇక విక్కీ కౌశల్ తన చిన్నతనంలో చాలావరకు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు .. ఒక మధ్య తరగతి కుటుంబంలో చాలీచాలని డబ్బులతో తన కోరికలను అదుపు చేసుకుంటూ వచ్చేవాడు .. వాళ్ల తండ్రి మొదట వాచ్మెన్ గా ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు .. ఆ తర్వాత ఫైట్ మాస్టర్ కి అసిస్టెంట్గా వెళ్లారు .. అలా కొద్ది రోజుల్లోనే ఆయన కూడా పెద్ద ఫైట్ మాస్టర్ గా మారినప్పటికీ పెద్దగా సినిమాల్లో అవకాశాలు రాలేదు .. చిన్న సినిమాలకు వచ్చిన డబ్బులు సరిపోక చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు .. ఇలాంటి క్రమంలోనే విక్కీ కౌశల్ తన ఖర్చులు తానే చూసుకోవాలని ఉద్దేశంతో తను కాలేజీ సెలవులు సమయంలో షూటింగ్లో లైట్ బాయ్ గా పని చేసేవాడు.. దాని ద్వారా ఎంతో కొంత డబ్బులు సంపాదించుకుని తన ఖార్చులు తానే తీర్చుకుంటూ ఉండేవాడు .. అలాంటి సమయంలోనే ఒకరోజు విక్కీ కౌశల్ లైట్ బాయ్‌గా వెళ్ళటంతో వాళ్ళ నాన్న ఆ సినిమాకి ఫైట్ మాస్టర్ గా వచ్చారు ..
అది చూసిన విక్కి నాన్న చిత్ర పరిశ్రమలో లైఫ్ అనేది సరిగ్గా ఉండదు నువ్వు ఇండస్ట్రీ లోకి రావటం నాకు నచ్చటం లేదు బాగా చదువుకొని చెప్పడంతో అప్పుడు విక్కీ కౌశల్ తన పూర్తి ఇంట్రెస్ట్ మొత్తం చదువు మీద పెట్టారు .. మొత్తానికి తన చదువు పూర్తయిన తర్వాత బాలీవుడ్ అగ్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో నటుడుగా మారాడు .. విక్కీ నటుడిగా చేసిన సినిమాల్లో సంజు , వురి సినిమాలు ఆయనకి మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టాయి. ఇలా మొత్తానికి లైట్ మ్యాన్‌గా కెరియర్ మొదలు పెట్టిన విక్కీ కౌశల్ ఇప్పుడు బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు .. చావా సినిమాతో ఖాన్ త్రయనికి సైతం పోటీ ఇచ్చే విధంగా గుర్తింపు తెచ్చుకున్నాడు అంటూ బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు కూడా వస్తున్నాయి .. ఏది ఏమైనా కూడా టాలెంట్ ఉన్నవాడు ఏదైనా చేయగలడు అని మరోసారి ప్రూవ్ చేశాడు విక్కీ కౌశల్ .. మరి రాబోయే రోజుల్లో మరన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.