ఇటీవలే ఈ కవర్ ఫోటో ఘాట్ కూడా జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ' నేడు ఇండియన్ బాక్స్ ఆఫీసు వద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా జీవితంలో నాకు వచ్చిన అతిపెద్ద అవకాశం ఇదే. బలం, ఆత్మవిశ్వాసం మనసులో ఉంటాయి, ఎవరూ వాటిని తీసేయలేరు. విజయం తర్వాత కూడా వినయంగా ఉండాలి. సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేకుండా ఉండే వ్యక్తులను చాలా మందిని నేను చూశాను. ఇక నేను 100 శాతం సామాన్యుడినే' అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.
ఇక ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 హిట్ కొట్టి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. స్టార్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. అయితే ఇప్పటికే పార్ట్ వన్ హిట్ కొట్టడంతో ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమాను తీశారు. అల్లు అర్జున్ వేసిన అమ్మవారి గెటప్ కి మాత్రం ఫాన్స్ పెరిగిపోయారు.. ఆ పాటలో ఆయన యాక్టింగ్ కి ప్రశంసల వర్షం కురిసిందనే చెప్పాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటించింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 1,871 కోట్లు వసూలు చేసింది.