సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ శాతం స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే దాదాపు ఆ సినిమాలకు వారం గ్యాప్ లోనే మీడియం రేంజ్ హీరోలా సినిమాలు విడుదల అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం స్టార్ హీరోల సినిమాలతో మీడియం రేంజ్ హీరోలా మూవీ విడుదల అయినట్లయితే స్టార్ హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినట్లయితే మీడియం రేంజ్ హీరోల సినిమాలకు మంచి టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.

ఒక వేళ స్టార్ హీరోల సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిన కూడా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే కనీసం స్టార్ హీరోల సినిమా విడుదలకి , మీడియం రేంజ్ హీరోల సినిమాల విడుదలకు మధ్య కనీసం వారం గ్యాప్ ఉండేలా నిర్మాతలు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇకపోతే ఈ సంవత్సరం ఓ తేదీన ఇద్దరు స్టార్ హీరోలతో ఓ మీడియం రేంజ్ హీరో సినిమా తలపడే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన మీడియా రేంజ్ హీరోలలో ఒకరు అయినటువంటి నితిన్ ప్రస్తుతం తమ్ముడు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ ని కూడా మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ ఈ రెండు సినిమాలతో పాటు నితిన్ హీరోగా రూపొందుతున్న తమ్ముడు సినిమా కనుక విడుదల అయినట్లయితే ఆ రెండు సినిమాల్లో ఏ సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా తమ్ముడు సినిమా కలెక్షన్లు తప్పే అవకాశం ఉంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: