కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో లోకేష్ కనకరాజ్ ఒకరు. ఈయన మా నగరం అనే సినిమాతో దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కార్తీ హీరోగా ఖైదీ అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయింది. ఇక విడుదల తర్వాత ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన టాక్ రావడంతో ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా లోకేష్ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

ఇక ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈయన కొంత కాలం క్రితం విక్రమ్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇకపోతే ఆఖరుగా లోకేష్ "లియో" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను కాస్త నిరుత్సాహ పరిచింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న కూలీ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో నాగార్జున ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. లోకేష్ స్పీడ్ గా సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్. ఈ దర్శకుడు చాలా స్పీడ్ గా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంటాడు.

ఇక కూలీ సినిమాను మొదలు పెట్టినప్పుడు కూడా ఈ మూవీ చాలా త్వరగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని రజిని , నాగ్ ఫాన్స్ భావించారు. కానీ లియో ఫెయిల్యూర్ ఎఫెక్ట్ కారణంగానో మరే కారణంగానో తెలియదు కానీ కూలీ సినిమా కోసం లోకేష్ చాలా సమయాన్ని తీసుకుంటున్నాడు. ఇలా లోకేష్ "లియో" సినిమా తర్వాత తన రూటును కూలీ సినిమా విషయంలో మార్చినట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: