కొన్ని సంవత్సరాల క్రితం వరుణ్ సందేశ్ హీరోగా శ్వేతా బసు ప్రసాద్ హీరోయిన్గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కొత్త బంగారులోకం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా వరుణ్ సందేశ్ , శ్వేతా బసు ప్రసాద్ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఇంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమాలో మొదట హీరో పాత్రకు వరుణ్ సందీప్ ను అనుకోలేదట. ఒక ఇద్దరు హీరోలను మొదటగా అనుకోగా వారు రిజెక్ట్ చేయడంతో వరుణ్ సందేశ్ కు ఈ సినిమాలో హీరోగా అవకాశం వచ్చిందట. ఆ హీరోలు ఎవరు ..? ఎందుకు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు అనే వివరాలను తెలుసుకుందాం.

శ్రీకాంత్ అడ్డాల "కొత్త బంగారులోకం" సినిమా కథ మొత్తం పూర్తి అయిన తర్వాత దీనిని నాగ చైతన్య తో చేయాలి అనుకున్నాడట. ఈ సినిమాతోనే చైతూ ను లాంచ్ చేస్తే బాగుంటుంది అని ఉద్దేశంతో నాగార్జునకు ఈ మూవీ కథను కూడా వినిపించారట. నాగార్జునకు కథ బాగానే నచ్చినప్పటికీ ప్రేమ కథాంశంతో రూపొందే సినిమాతో చైతూ లాంచ్ అయితే ఆ సినిమా వల్ల లవర్ బాయ్ ఈమేజ్ వస్తే ఆ తర్వాత మాస్ సినిమాలు వస్తాయో లేవో అని ఉద్దేశంతో ఈ కథను నాగార్జున రిజెక్ట్ చేశాడట. ఇక ఆ తర్వాత ఈ మూవీ కథను శ్రీకాంత్ అడ్డాల , రామ్ పోతినేని కి వినిపించాడట. కథ మొత్తం విన్న రామ్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాలమూవీ కథను వరుణ్ సందేశ్ కు వినిపించగా ఆయన మాత్రం ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా మొదట కొత్త బంగారులోకం మూవీ కథను నాగచైతన్యకు , రామ్ పోతినేని కి వినిపించగా వారు రిజెక్ట్ చేయడంతో వరుణ్ సందీప్ హీరోగా ఈ మూవీ ని రూపొందించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs