
ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుకుమార్ . దీన్నంతటికి కారణం పుష్ప2 అని చెప్పుకొక తప్పదు . ప్రజెంట్ సుకుమార్ - రాంచరణ్ తో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు . ఆల్రెడీ వీళ్ళ కాంబోలో రంగస్థలం అనే సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది . కాగా వీళ్ల కాంబోలో మళ్లీ సినిమా తెరకెక్కబోతుంది అని తెలియగానే ఇది పూర్తిగా రంగస్థలం సినిమాకి సీక్వెల్ అనుకున్నారు. కానీ కాదు ఇది టోటల్గా ఫ్రెష్ సబ్జెక్ట్ అంటూ తెలుస్తుంది. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అంటూ టాక్ వినిపిస్తుంది .
అయితే మరొక పక్క మాస్ యాక్షన్ ధ్రిలర్ గా కూడా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో రామ్ చరణ్ ఒక్కడే కాదు అని.. మరొక సర్ప్రైజ్ కూడా ఉంది అంటూ తెలుస్తుంది. ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ పాత్రలో కనిపించబోతున్నట్లు బాగా వార్తలు వినిపిస్తున్నాయి . నాయక్ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇన్నాళ్లకు మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో డబల్ బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో నటించబోతున్నారు అంటూ తెలుస్తుంది . ఇది నిజంగా రామ్ చరణ్ కి బాగా కలిసి వచ్చే మ్యాటర్ అంటున్నారు జనాలు . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో. కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా హీరోయిన్గా రష్మిక మందన్నానే చూస్ చేసుకున్నారట సుకుమార్..!