
అయితే ఆ తర్వాత వెంకీ దగ్గర్నుంచి వచ్చిన మిస్టర్ మజ్ను, రంగ్‌దే సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టులేకపోయాయి .. ఆ తర్వాత కోలీవుడ్ హీరో ధనుష్ తో స్టార్ మూవీ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు .. ధనుష్ హీరోగా వచ్చిన సార్ మూవీ తెలుగు , తమిళ భాషల్లో భారీ హిట్ సాధించింది.. ఆ తర్వాత లక్కీ భాస్కర్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి.. లక్కీ భాస్కర్ లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించారు .. బ్యాంకింగ్ వ్యవస్థల్లోని లోపాలు , ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ , క్రైమ్ కలగలిపి లక్కీ భాస్కర్ సినిమాని గొప్పగా తెరకెక్కించాడు .. ఇలా ధనుష్ , దుల్కర్ సల్మాన్ తో సినిమాలు చేసిన వెంకీ అట్లూరి తర్వాత కోలీవుడ్ హీరో సూర్యాతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది .. ఇప్పటికే ఆయనతో సినిమా దాదాపు ఖాయం అయిందని అంటున్నారు .. త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుంది ..
ఈ క్రమంలోనే వరుసగా వెంకీ అట్లూరి ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయడానికి కారణమేమిటి అనే చర్చ గట్టిగా నడుస్తుంది .. అందుకు పలు రకాల కారణాలు కూడా ఉన్నాయి .. తన కథలు తెలుగు హీరోస్ కి సెట్ కావని భావిస్తూ ఉండొచ్చు అలాగే టాలీవుడ్ స్టార్స్ ఎవరూ ఖాళీగా లేరు . అదే విధంగా కోలీవుడ్ బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం వలన తెలుగుతో పాటు మరొక భాషలో కూడా మార్కెట్ వస్తుంది.. థియేటర్కెల్ ఓటిటి బిజినెస్ కూడా బాగా జరుగుతుంది .. ఇలాంటి కారణాలు రీత్యా కూడా వెంకీ అట్లూరి ఇతర భాష హీరోలతో సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని కూడా అంటున్నారు .. ఇక ప్రస్తుతం సౌత్ స్టార్ హీరో సూర్య విజయాలు లేక ఇబ్బంది పడుతున్నారు మరి వెంకీ అట్లూరి సినిమాతో అయినా సూర్య సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి.