పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్స్ కి ఉన్నటువంటి క్రేజ్‌ ప్రస్తుతం ఎలాంటిదో కొత్తగా చెప్పనవసరం లేదు . పుష్ప2 ,  స్త్రీ 2 వంటి సినిమాలు తాజా ఉదాహరణలుగా చెప్పవచ్చు .. ప్రధానంగా మన తెలుగు ప్రేక్షకులు కంటే బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ సిక్కుల్స్ భారీ స్థాయిలో ఉంది .. మన తెలుగు చిత్ర పరిశ్రమ లో కూడా ప్రేక్షకులను బాగా ప్రభావితం చేసిన సినిమాలకు సిక్కుల్స్ వస్తే కచ్చితంగా మంచి బజ్‌ ఉంటుంది .. అలాంటి సినిమాల్లోనే అఖండ కూడా ఒకటి .. నట‌సింహం నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరిని ఎంతగానో మెప్పించింది .. 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి సెలవులు పూర్తయ్య వరకు థియేటర్లో సందడి చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు .. ఈ మూవీ ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్ అనేది అలాంటి సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రానుంది.


గత 20 రోజుల నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో నాన్ స్టాప్ గా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది .. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని ఆలోచనలు మేకర్స్ ఉన్నారు .. అయితే అదే రోజున పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ రాజా సాబ్ కూడా విడుదల కాబోతుంది .. మార్కెట్ పరంగా చూసిన ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చేసిన బాల‌య్య , ప్రభాస్ ఏమాత్రం సరిపోదు అనేది నందమూరి అభిమానులు సైతం ఒప్పుకుంటారు .. కానీ రాజా సాబ్‌ సినిమాకి అఖండ 2 కి ఉన్నంత క్రేజ్ లేదునేది వాస్తవం .. ప్రభాస్ అభిమానులు కూడా ఇది ఒప్పుకోవాలి .. అన్ని వర్గాల ప్రేక్షకులు తమ మొదటి ఛాయ‌స్గా అఖండ 2ని ఎంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి .. కాబట్టి ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే కచ్చితంగా రాజాసాబ్‌ కి భారీ నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది.


ఈ సంక్రాంతికి ఎలా అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజ‌ర్‌ సినిమాపై సీనియర్ హీరో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ లీడ్ తీసుకుందో అలా రాజా సాబ్‌ సినిమాపై బాలయ్య లీడ్ తీసుకునే అవకాశం కచ్చితంగా కనిపిస్తుంది . ఇదే క్రమంలో గతంలోకి వెళ్తే 2010లో ప్రభాస్ డార్లింగ్ , బాలయ్య సింహ సినిమాలు వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి .. డార్లింగ్ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ అయింది .. కానీ బాలయ్య సింహ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించింది అనే చెప్పాలి .. ఇక ఈ సినిమా కలెక్షన్లు ప్రభాస్ డార్లింగ్ కంటే 10 కోట్లు ఎక్కువ వచ్చాయి .. ఇక ఇప్పుడు రాజాసాబ్‌ వర్సెస్ అఖండ 2 సినిమాలు పోటీపడితే మరోసారి 2010సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: