ఉత్తరప్రదేశ్లో జరిగిన కుంభమేళలో ఒక్కసారిగా పూసలు అమ్ముకొనే అమ్మాయి మోనాలిసా ఎంతలా పాపులర్ అయ్యిందంటే ఈమె అందంతో రాత్రికి రాత్రి ఒక సెలబ్రిటీగా మారిపోయి.. ఏకంగా సినిమాలో అవకాశమే సంపాదించుకుంది. చాలామంది ఈ ఇమే క్రేజ్ పాపులారిటీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సనోజ్ మిశ్రా ఈమె ఇంటికి వెళ్లి మరి తన సినిమాలో హీరోయిన్ గా నటించమంటూ ముందుకు వచ్చారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే చిత్రంలో ఈమెను హీరోయిన్గా ఎంచుకోవడం జరిగింది.


దీంతో పూసలు అమ్ముకునే అమ్మాయి హీరోయిన్ కావడంతో దేశం మొత్తం సంచనాలంగా మారిపోయింది. ఈమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో ఇన్స్టాగ్రామ్ లో కూడా అడుగు పెట్టింది. అలా వచ్చిన రోజే లక్ష సంఖ్యలు అభిమానులు ఏమైనా ఫాలో అవడం మొదలుపెట్టారట. ఇవే కాకుండా పలు రకాల బ్రాండ్స్ కి ఈమెను అంబాసిడర్ గా కూడా చేశారు అయితే రీసెంట్గా ప్రముఖ నిర్మాత జితేంద్ర నారాయణ్.. మనోజ్ మిశ్రా పైన చాలా భయంకరమైన ఆరోపణలు చేయడం జరిగింది.


నిర్మాత సనోజ్ వద్ద ఎలాంటి డబ్బు లేదని దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీగా పాపులారిటీ అయిన మోనాలిసా పేరును వాడుకొని వార్తలలో నిలవాలని చూస్తున్నారని దీని ద్వారా ఫైనాన్షియల్ గా ఆకర్షించి డబ్బులు కొట్టేయాలని ప్లాన్లో ఉన్నారని మోనాలిసా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు.. ఆమె జీవితమే రిస్క్ లో పడిందని తెలిపారు జితేంద్ర నారాయణ్.. ఆమెను ఏమైనా చేయవచ్చు.. కానీ ఈ విషయం పైన మోనాలిసా మాట్లాడుతూ సనోజ్ మిశ్రా పైన వస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజము లేదని తనని సొంత కూతురులా చూసుకుంటున్నారని తాను ఎవరి ట్రాప్ లో పడలేదని తెలిపిందట. ప్రస్తుతం తాను మధ్యప్రదేశ్లో ఒక యాక్టింగ్ స్కూల్లో ఉన్నానని తనతో పాటు తన సోదరి పెదనాన్న ఉంటున్నారంటూ తెలిపిందట. మరి రాబోయే రోజుల్లో మోనాలిసా జీవితం ఎలా తిరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: