టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించి అదిరిపోయి రేంజ్ లో క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. మహేష్ ఆఖరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటించాడు. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. మహేష్ తన తదుపరి మూవీ గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

మూవీ యొక్క షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ తన కెరియర్ లో ఎన్నో మూవీలను వదులుకున్నాడు. అందులో కొన్ని మూవీలు అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే మహేష్ వదులుకున్న ఓ సినిమా తాజాగా విడుదల అయ్యే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. మరి మహేష్ తాజాగా వదిలేసిన సినిమా ఏదో తెలుసా అదే చావా. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన హీరోయిన్గా తాజాగా చావా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది.

ఇకపోతే ఈ మూవీ మేకర్స్ మొదట చావా సినిమాలో విక్కీ కౌశల్ పాత్ర కోసం మహేష్ బాబును సంప్రదించారట. కథ మొత్తం విన్న మహేష్ కూడా సూపర్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడట. కానీ కొన్ని కారణాల వల్ల చివరగా ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఇక తాజాగా విడుదల అయిన చావా సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: