
ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండడం మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి . అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. నిజానికి ఈ మూవీ ఓపెనింగ్ టైం లో దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నారని టాక్ గట్టిగా వినిపించింది . అక్టోబర్ 16 అని డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది . నిజానికి దసరా కాస్త ఎర్లీగా రావడంతో ఈ సినిమాని దీపావళి కానుక గా రిలీజ్ చేయాలి అనుకున్నారట . దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత దీపావళికి విడుదల చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట మూవీ టీం .
ఒకవేళ అంత అనుకున్నట్లే జరిగితే దీపావళి కానుకగా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అయితే దీని పట్ల ఇప్పుడు నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది . అక్టోబర్ 16న రిలీజ్ చేసేది ఏదో అక్టోబర్ 2న రిలీజ్ చేస్తే దసరా హాలిడేస్ కలిసి వస్తుందిగా . హాలిడేస్ మూమెంట్లో పిల్లలు కూడా సినిమాకి వస్తారు.. ఫ్యామిలీ అంతా సరదాగా చూసి ఎంజాయ్ చేస్తారు. సినిమాకి బాగా కలిసి వస్తుంది . బుచ్చిబాబు సనా ఆ మాత్రం ఆలోచించలేడా అంటున్నారు జనాలు. మరికొందరు దీపావళి అనుకుంటే అది కాస్త క్రిస్మస్ కి రిలీజ్ అవుతుంది అని కావాలనే ఎద్దేవా చేసి ట్రోల్ చేస్తున్నారు..!