ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పుష్ప సిరీస్ మూవీల ద్వారా అద్భుతమైన విజయాలు , సూపర్ క్రేజ్ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. పుష్ప మూవీ లో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. ఇకపోతే పుష్ప పార్ట్ 1 సినిమాను తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల చేశారు.

సినిమా విడుదల సమయంలో ఈ మూవీ పై హిందీ ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. అలాగే అల్లు అర్జున్ కి కూడా ఈ సినిమా సమయంలో హిందీ లో పెద్దగా క్రేజ్ లేదు. దానితో ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా హిందీ లో విడుదల అయింది. కానీ విడుదల తర్వాత ఈ మూవీ కి హిందీ ఏరియాలో మంచి టాక్ రావడంతో ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి హిందీ ఏరియాలో 108.61 కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 పై హిందీ ప్రేక్షకులు మొదటి నుండి భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయ్యింది.

ఈ సినిమాకు హిందీ ఏరియాలో బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి హిందీ ఏరియాలో 830.10 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే హిందీ ఏరియాలో అత్యధిక నెట్ కలెక్షన్లను వసూలు చేసిన సౌత్ మూవీ లిస్టు లో పుష్ప పార్ట్ 2 మూవీ 830.10 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా ... పుష్ప పాటు 1 మూవీ 108.61 కలెక్షన్లతో 11 వ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa