సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించిన 'బాపు సినిమా' పాజిటివ్ టాక్ ని సొంత చేసుకుంది. ఈ సినిమాకు డైరెక్టర్ దయాకర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ ఆమని, ధన్య బాలకృష్ణ, బలగం సుధాకర్ రెడ్డి, మణి, రచ్చ రవి ముఖ్య పాత్రలలో కనిపించారు. ఈ సినిమా రిలీజ్ కి ముందే టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ ఒక తండ్రి గురించి తెలియజేసే ఒక అద్బుతమైన కథ. మరి ఈ సినిమా కథ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం.
బాపు సినిమాలో బ్రహ్మాజీ మల్లన్న అనే ఒక రైతు. చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉంటాడు. వర్షం వల్ల పంట కూడా నాశనం అవుతుంది. అటు అప్పుల బాధ, ఇటు కుటుంబ బాద్యతలు. ఈ కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. కానీ తాను చస్తే ఒరిగేదేమి లేదని.. తన తండ్రి రాజన్న చస్తే గవర్నమెంట్ రూ. 5 లక్షలు ఇస్తుందని అనుకుంటాడు. దాంతో తండ్రి చావు కోసం మల్లన్నతో పాటుగా అతని భార్య, పిల్లలు కూడా ఎదురుచూస్తారు.. ఏం చేస్తారనే దానిపైననే ఈ సినిమా నడుస్తుంది.  
ఇక బ్రహ్మాజీ రైతు పాత్రలో చాలా బాగా నటిస్తాడు. ఈ సినిమాలో తెలంగాణ యాస చాలా సహజంగా ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే గుండెల్ని పిండేసేలా ఉంటాయి. బలగం సుధాకర్ మరోసారి తండ్రి పాత్రలో జీవించేశాడు. అలాగే ఈ సినిమాలో కుటుంబం అంటే ఏంటి.. కుటుంబ బాధ్యతలు అంటే ఏంటి అనేది చాలా బాగా చూపించారు. ఆమని కూడా తల్లి పాత్రలో చాలా బాగా నటిస్తుంది. మొత్తంగా ఈ సినిమాలో వారి నటన బాగుంది. కానీ పాటలు అంతగా హిట్ కొట్టలేదు. దయాకర్ రెడ్డి చాలా తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాను అందించడని చెప్పొచ్చు. కథ బాగుంది కానీ ఇంకాస్త ఇంటరెస్టింగ్ గా ఉంటే బాగుండేది. ఈ సినిమా ద్వారా మనిషిలో చచ్చిపోతున్న ఎమోషన్స్ ని గుర్తు చేస్తుంది. ఇంకా కొంచెం బాగా తీసి ఉంటే మరో బలగం అయ్యేది. బాపు మూవీకి 2.5 రేటింగ్ వచ్చింది.    




మరింత సమాచారం తెలుసుకోండి: