టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఇద్దరు స్టార్ హీరోలు ఓ మూవీ కథను రిజెక్ట్ చేయగా అదే కథతో రూపొందిన సినిమాలో ఓ నటుడు హీరోగా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా ఏది ..? ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించడంతో రవితేజ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరో గా రవితేజ మొదటి ఆప్షన్ కాదట. ఓ ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాను కథను రిజెక్ట్ చేయగా మూడవ అవకాశంగా రవితేజను ఈ సినిమాలో హీరోగా తీసుకున్నారట. భద్ర సినిమా కథ మొత్తం పూర్తి అయిన తర్వాత బోయపాటి శ్రీను ఈ మూవీ కథను అల్లు అర్జున్ కు వినిపించాడట. కథ మొత్తం విన్న ఆయన స్టోరీ సూపర్ గా ఉంది. కానీ నేను ఇప్పటికే ఆర్య మూవీ కి కమిట్ అయ్యి ఉన్నాను. ఆ సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది.

మీరు అన్ని రోజులు ఆగడం కష్టం. వేరే హీరోతో ఈ సినిమా చేయండి అని సలహా ఇచ్చాడట. ఆ తర్వాత బోయపాటి శ్రీను , జూనియర్ ఎన్టీఆర్ కి ఆ కథను వినిపించాడట. కథ మొత్తం మిన్న తారక్ సినిమా కథ నచ్చకపోవడంతో ఆ కథను రిజెక్ట్ చేశాడట. దానితో బోయపాటి శ్రీను , రవితేజ అయితే ఈ కథకు బాగుంటాడు అనే ఉద్దేశంతో ఆయనకు ఈ మూవీ స్టోరీని వినిపించాడట. ఆయన మాత్రం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. బన్నీ , తారక్ రిజెక్ట్ చేసిన స్టోరీ తో రవితేజ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: