
అయితే ఇంతలోనే ఈ జంట విడిపోవడం ఖాయమని విడాకులు పరిష్కారం లో భాగంగా తన భార్య ధనశ్రీకి దాదాపు 60 కోట్ల మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తాడు అనే గుసగుసలు కూడా నేషనల్ మీడియాలో వినిపిస్తున్నాయి .. అయితే విడాకుల గురించి లేదా భరణ ఒప్పందం గురించి ఆ ఇద్దరిలో ఎవరు బహిరంగంగా మాట్లాడటం లేదు .. అయితే నటి కం డాన్సర్ అయిన ధనశ్రీ వర్మ తమపై వస్తున్నవని పుకార్లు అని కొట్టి పడేసింది .. కొందరు నిరాధారమైన వాదనలు చేస్తున్నారని ఆరోపించింది .. సోషల్ మీడియాలో ఊహాగానాలు చేసే ప్రతి దాన్ని నిజం అని అనుకోకూడదు అని కూడా ధనశ్రీ చెప్పింది ..
ఇక ఈ పుకార్లు తను తన కుటుంబాన్ని తీవ్రంగా బాధిస్తున్నాయని కూడా తన ధనశ్రీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు .. ఇక 2020 కోవీడ్ సమయంలో చాహల్ , ధనశ్రీ మధ్య స్నేహం మొదలైంది .. డ్యాన్స్ విడియోలు చూసి చాహల్ ఇంప్రెస్ అయ్యాడు .. ఆ తర్వాత అతడు డ్యాన్స్ నేర్చుకోవడానికి ధనశ్రీని సంప్రదించాడు .. టీచర్ స్టూడెంట్ సంబంధం కాస్త నిజమైన ప్రేమబంధంగా మారింది .. చివరకు వారు వివాహం చేసుకున్నారు .. ఇంతలో నాలుగేళ్లలోనే విడాకుల పుకార్లు వచ్చేసాయి .. అయితే చాహల్ ఇటీవల ఆర్జే మహవాష్ ఇతర స్నేహితులతో క్రిస్మస్ జరుపుకుంటున్న ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి .. అయితే ఇప్పటికీ చాహల్, ధనశ్రీ ఇద్దరూ పుకార్ల గురించి నోరు విప్పలేదు. వారి మధ్య ఏం జరుగుతోందో ఎవరికీ ఎలాంటి స్పష్ఠతా లేదు.