
ఓ మరాఠా యోధుని జీవిత కథపై బాలీవుడ్లో సినిమా రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇంతకు మునుపు మరాఠాలో కొన్ని సీరియల్స్ మినహా ఈ అంశంపై సినిమా తీసిన దాఖలాలు ఎక్కడా లేవు. మొదటిసారి తనకి ఇష్టమైన నాయకుడిపై సినిమా రావడంతో మరాఠా ప్రజలు కూడా ఈ సినిమాని తమ భుజాలపై మోస్తున్నారు. హిందువులు ఎంతో సెంటిమెంట్ గా ఫీలైన చత్రపతి శివాజీ తనయుని జీవిత కథ కాబట్టి చాలామంది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. ఇటువంటి తరుణంలో ఒక బాలీవుడ్ నటి ఈ సినిమాపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రజలు మండిపడుతున్నారు. పైగా ఆమె ఒక బాలీవుడ్ నటి కావడం దురదృష్టకరం అంటున్నారు.
ఆమె మరి ఎవరో కాదు.... బాలీవుడ్ నటి స్వర భాస్కర్. ఆమె తాజాగా ఓ మీడియా వేదికలో చాలా సినిమా గురించి మాట్లాడుతూ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. చావా సినిమాలో చాలా సినిమాటిక్ కల్పితాలు చేశారని, వాస్తవానికి అసలు కథ వేరే ఉందని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సింగిల్ లైన్ లో ఉన్న ఒక కథను పట్టుకొని సాగదీసి... నాగదేసి మరి మూడు గంటల పాటు జనాలకు బోరు కొట్టించారని అన్నారు. అందుకే సినిమాలో చాలా సీన్లు రిపీటెడ్ గా వస్తాయని అభిప్రాయపడ్డారు. దాంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో అభిమానులు స్పందిస్తూ.... స్వర భాస్కర్ అనే నటికి పుస్తకాలు చదవడం వచ్చా? అసలు ఆమె చరిత్రను ఎట్లా వక్రీకరిస్తారు? నటనలో కనీసం ఓనమాలు కూడా దిద్దని ఆమె ఓ చరిత్రకారును గురించి మాట్లాడడం చాలా సిగ్గుగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈరోజు ఆమె అనుభవించిన స్వాతంత్రం అలాంటి మహానుభావుల వలన వచ్చిందని ఆమె బహుశా మరిచిపోయి ఉంటారు అని విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే నటి స్వర భాస్కర్ గురించి ఓనటిగా జనాలకి పెద్దగా తెలియకపోయినా, ప్రస్తుత వివాదం వలన ఆమె పేరు జనాలకు తెలిసింది. బహుశా ఈ పాపులారిటీ కోసమేనేమో ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఆమె ఎత్తు కూడా ఫలించింది అని కూడా చెబుతున్నారు. నటి స్వర భాస్కర్ ఒక సీనియర్ నటి. ఆమె 2009లో మధోలాల్ కీప్ వాకింగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2012 జీ సినీ అవార్డ్స్, స్క్రీన్ అవార్డ్స్, సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వంటి అవార్డులను కూడా అందుకుంది.