అల్లు అర్జున్.. ఓ  స్టైలిష్ స్టార్..ఓ పాన్ ఇండియా స్టార్.. ఇలా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అల్లు అర్జున్ గురించి చెప్పాలి అంటే పుష్ప సినిమా ముందు పుష్ప సినిమా తర్వాతనే చెప్పాలి . అంతకుముందు అల్లు అర్జున్ ని ఇష్టపడే వాళ్ళు జనాలు . ఒక హీరోగా మాత్రమే . అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనలోని స్పెషల్ టాలెంట్ చూసి జనాలు షాక్ అయిపోయారు.  అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ని లైక్ చేయడానికి మెయిన్ రీజన్ పుష్ప సినిమా అనే చెప్పాలి .


కాగా రీసెంట్గా అల్లు అర్జున్ ఒక స్పెషల్ స్పెషల్ ఘనతను అందుకున్నాడు . ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజైన్ "హాలీవుడ్ రిపోర్టర్" ఇప్పుడు "ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా " అనే పేరిట భారతదేశంలో ప్రారంభం అవుతుంది.  ఆశ్చర్యమేంటంటే ఈ మ్యాగజైన్ తన తొలి సంచికను స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖచిత్రంతో విడుదల చేయడం ఫ్యాన్స్ కి ఫుల్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది . అల్లు అర్జున్ ప్రధాన ఆకర్షణగా  కథనాన్ని కూడా ఈ కవర్ స్టోరీలో ప్రస్తావించడం చాలా హైలెట్ గా మారింది.



అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా హిందీ సినిమా చరిత్రను తిరగరాసింది అనే విషయం అందరికీ తెలుసు . ఆ విషయాన్ని కూడా "ది హాలీవుడ్ రిపోర్ట్ ఇండియా" పేర్కొంది . అంతేకాదు ఆయన "స్టార్ ఆఫ్ ఇండియా"  అంటూ అభివర్ణించింది.  అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది ఫుల్ మీల్స్ అనే చెప్పాలి.  అంతేకాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ హంగామా చేసేస్తున్నారు . ఇలాంటి ఒక రేర్ ఘనత అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కావడం గమనార్హం. అయితే అల్లు అర్జున్ ఇంతటి ఘనత సాధించడానికి కర్త - కర్మ - క్రియ మాత్రం మొత్తం సుకుమార్ అనే అంటున్నారు జనాలు . సుకుమార్ లేకపోతే పుష్ప2 లేదు అని పుష్ప2 లేకపోయి ఉంటే అల్లు అర్జున్ కి ఇంత స్టార్ డమ్ వచ్చేదే కాదు అని సుకుమార్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.  నిజమే చాలా ఫంక్షన్స్ లో అల్లు అర్జున్ కూడా ఇదే చెప్పాడు . సుకుమార్ లేనిదే తనకు లైఫ్ లేదు అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు. అయితే మరికొందరు గిట్టని వాళ్లు మాత్రం ఆయన డబ్బులు ఇచ్చి ఇలా ఫోటో వేయించుకున్నారు అంటున్నారు. ఇది బన్నీ ఫ్యాన్స్ కి మడేలా చేస్తుంది. ఛీ ఛీ ఇక ఈ జనాలు మారరు..బన్నీకి ఆ కర్మ ఏం పట్టలేదు అంటూ ఘాటుగా కౌంటర్స్ ఇస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: